నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ : సెన్సెక్స్ 500 పాయింట్లు ఢమాల్...

నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ : సెన్సెక్స్ 500 పాయింట్లు ఢమాల్...

ప్రపంచ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాల వల్ల ఈరోజు (ఫిబ్రవరి 27) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాలు పెరగడం, పెట్టుబడిదారులు లాభాలను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్ డీలా పడింది.

దింతో సెన్సెక్స్ ఉదయం 10:10 గంటల సమయానికి 501 పాయింట్లు తగ్గి 81,747 వద్ద ఉండగా.. నిఫ్టీ 176 పాయింట్లు తగ్గి 25,320 వద్ద కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే ఇండియా VIX 3.42% పెరిగింది. అంటే ట్రేడర్లలో ఆందోళన ఎక్కువగా ఉందని అర్థం.

 అంతర్జాతీయంగా వాణిజ్య సుంకాలు (Tariffs), దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం వల్ల ఈ అనిశ్చితి నెలకొంది.మన దేశ ఆర్థిక వృద్ధి రేటు (GDP) వివరాలు ఈరోజు సాయంత్రం విడుదల కానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.  గత కొన్ని రోజులుగా షేర్ మార్కెట్లు పెరగడంతో, చాలామంది ఇప్పుడు  లాభాలను నగదు రూపంలోకి మార్చుకుంటున్నారు. 

రంగాల వారీగా చూస్తే దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా రియాల్టీ, హెల్త్‌కేర్, చమురు & గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్,  ఆటో, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాలు 1% వరకు పడిపోయాయి. FMCG అత్యధికంగా 1.37% నష్టపోయింది.బ్యాంక్ షేర్లు ఒత్తిడిలో ఉండగా.. ప్రభుత్వ (PSU), ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ దాదాపు 1% వరకు నష్టపోయాయి.

అమెరికాలోని టెక్నాలజీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో అక్కడి మార్కెట్లు నిన్న  నష్టాల్లో ముగిశాయి. దీని ప్రభావం ఈరోజు ఆసియా, భారత మార్కెట్లపై కూడా పడింది.