
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే కేంద్ర నుంచి సాయం కోరలేదని అన్నారు. ఈ భారాన్నంతా రాష్ట్ర ప్రభుత్వంపై మోపి విమర్శలు చేయడం తగదని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు.
మే 17వ తేదీ శుక్రవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏప్రిల్, మే నెలలో వడదెబ్బ తో 97 మంది చనిపోయినా కిషన్ రెడ్డి నుంచి స్పందన లేదు. సహాయం చేయాలని కేంద్రానికి కనీసం లేఖ కూడా కిషన్ రెడ్డి రాయలేదు. డ్రిప్ ఇరిగేషన్ పై కూడా బీజేపీ ప్రభుత్వం జీఏస్టీ వేసింది.వ్యవసాయ పంటల ధరలు తిరోగమనం లో వెళ్తున్నాయి.. ఇదీ బీజేపీ ప్రభుత్వం ఘనత’ అంటూ దుయ్యబట్టారు. కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ నేతలు పనిలేక ధర్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం లో పంట నష్ట పరిహారం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? కేసీఆర్ పాలన లో తరుగు తో రైతులను నిండా ముంచారు. ఇప్పుడు ఒక్క కిలో తరుగు కూడా తీస్తలేం. రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు. వర్షాకాలం పంట నుంచి వరికి 500 బోనస్ ఇస్తాం. నకిలీ విత్తనాల సమస్య ఉంది.. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య పెరిగింది. నకిలీ విత్తనాలు అమ్మోతే పీడియాక్టు కేసులు పెడతం.’ అని అన్నారు.