టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఏడడుగులు వేసిన ఈ జోడీ, హైదరాబాద్‌కు విచ్చేసి తదుపరి ఈవెంట్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మార్చి 4న హైదరాబాద్లో తాజ్ కృష్ణ వేదికగా రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి కళ్లు మార్చి 4న జరగబోయే రిసెప్షన్ పైనే పడింది. ఇంతలోనే విజయ్-రష్మిక దంపతులు తమ అభిమానులకి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, లేటెస్ట్ సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మికతో కలిసి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్‌పేటకు రానున్నారని తెలుస్తోంది. సోమవారం (మార్చి 2న) విజయ్ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా విజయ్–రష్మిక దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారని టాక్. దీనికోసం గ్రామంలోని ఫామ్ హౌస్‌ను ప్రత్యేకంగా అలంకరిస్తూ ముస్తాబు చేస్తున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఈ పూజ అనంతరం 2 వేల మందికి పైగా అభిమానులకు విందు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయినప్పటికీ, ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విజయ్–రష్మిక అభిమానుల్లో ఆసక్తి, ఉత్సాహం పెరుగుతోంది.
