‘అన్ని కులాల ’కు ఒకే కటాఫ్ మార్కులు ఉండాలి : ఈబీసీ జేఏసీ చైర్మన్ రవీందర్ రెడ్డి

‘అన్ని కులాల ’కు ఒకే కటాఫ్ మార్కులు ఉండాలి : ఈబీసీ జేఏసీ చైర్మన్ రవీందర్ రెడ్డి
  • ఓసీ పేద అభ్యర్థులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: అన్ని కులాల అభ్యర్థులకు ఒకే కటాఫ్ మార్కులు ఉండాలని ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఓసీ పేద అభ్యర్థులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కానిస్టేబుల్, టెట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అన్ని కులాల అభ్యర్థులకు ఒకే కటాఫ్ మార్కులు ఉండాలని కోరారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు, బీసీలకు 70, ఓసీలకు 80 మార్కులుగా ఖరారు చేశారని పేర్కొన్నారు.

టెట్ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు 60, బీసీలకు 75, ఓసీలకు 90 మార్కులుగా ఖరారు చేశారని తెలిపారు. అర్హత మార్కులు అధికంగా నిర్ణయించడం వల్ల ఓసీ పేద అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గుర్తుచేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు.  విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఈడబ్ల్యూఎస్ లకు సైతం రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. కులాల ప్రాతిపదికన అర్హత మార్కులు నిర్ణయించడం వివక్ష చూపించటమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు.