T20 World Cup: దంచికొట్టిన వెస్టిండీస్.. తడబడిన భారత బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

T20 World Cup: దంచికొట్టిన వెస్టిండీస్.. తడబడిన భారత బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని భారత్ నిర్ణయించింది.  దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 8. 5 ఓవర్లో 85 పరుగులు వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ( 32 ) ఔట్ అయ్యాడు. 

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన షిమ్రాన్ హెట్మెయర్ టీమిండియా బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. జస్ట్  12 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సులతో 27 పరుగులు చేసి  జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో కీపర్ సంజూ శాంసన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.  ఆ తర్వాత బాల్ కే మరో ఓపెనర్ రోస్టన్ చేజ్ ( 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 40 పరుగులు ) కూడా హాఫ్ సెంచరీకి చేరుకుంటున్న తరుణంలో బుమ్రా ఔట్ చేయగా, తర్వాత  మైదానంలోకి వచ్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (14) కూడా ఎక్కువ సేపు క్రీజుల నిలవలేకపోయాడు.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కీపర్ శాంసన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. వరుసగా మూడు వికెట్లు పడటంతో 10 ఓవర్ తర్వాత వద్ద విండీస్ స్కోర్ కాస్త నెమ్మదించింది. 

ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి మధ్య జస్ట్ 22 బాల్స్ లోనే అర్థ శతకం భాగస్వామ్యం నెలకోల్పోరు. పావెల్ (  19 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 34 పరుగులు ), హోల్డర్ (  22 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సులతో 37 పరుగులు) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఇక భారత్ కి 196 పరుగుల టార్గెట్ ఇచ్చింది. అయితే,  టీమిండియా ఫిల్డింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా దారుణంగా విఫలమైంది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఏకంగా రెండు క్యాచ్ లను డ్రాప్ చేయగా.. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ ఘోరంగా బౌలింగ్ వేశారు. తలో నాలుగు ఓవర్లలో వేసిన ఈ ముగ్గురు బౌలర్లు ముగ్గురు 40 పరుగుల చొప్పున సమర్పించుకోగా పాండ్యా, వరుణ్ చెరో ఒక్కో వికెట్ పడగొట్టారు.