నెల్లూరు జీజీహెచ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. ఆదివారం ( మార్చి 1 ) సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్మేయడంతో రోగులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అక్కడే ఉన్న గర్భిణీలు, బాలింతలు భయంతో వణికిపోయారు. రోగులు, సిబ్బంది భయంతో ఆసుపత్రి బయటికి పరుగులు తీశారు.
ప్రమాదం జరిగిన సమయంలోనే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. కొంతమంది ఆసుపత్రి బయటికి రాగా.. మరికొంతమంది ఆసుపత్రి లోపలే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఫైర్ సిబ్బంది సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గర్భిణీలు, బాలింతలు, రోగులను సురక్షితంగా బయటికి తరలిస్తున్నారు పోలీసులు. మంటలను అదుపులోకి తెచెందుకు శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదం కారణంగా జీజీహెచ్ దగ్గర పరిస్థితి గందరగోళంగా మారింది. షార్ట్ సర్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
