సర్టిఫికెట్లు, డిగ్రీలు ఉన్న సంపాదన సున్నా! 26 ఏళ్ల ఓ నిరుద్యోగ యువతి ఆవేదన..

సర్టిఫికెట్లు, డిగ్రీలు ఉన్న సంపాదన సున్నా!  26 ఏళ్ల ఓ  నిరుద్యోగ యువతి ఆవేదన..

చదువు ఉంటే చాలు జీవితం సెటిల్ అయిపోతుందని నమ్మే మన దేశంలో, ఒక యువతి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో  చర్చకు దారితీశాయి. 26 ఏళ్ల వయసున్న ఆమె, తన దగ్గర ఎన్నో డిగ్రీలు ఉన్నా ఇప్పటికి నిరుద్యోగిగానే మిగిలిపోయానని బాధపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.

సమాచారం ప్రకారం.... 26 ఏళ్ల ఓ యువతీ తన విద్యా నేపథ్యం గురించి వివరిస్తూ.. 12వ తరగతిలో 8.2 CGPA సాధించానని, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశానని చెప్పింది. నా దగ్గర ప్రపంచంలోని అన్ని డిగ్రీలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ నేను నిరుద్యోగిని అని వాపోయింది. కేవలం సర్టిఫికెట్ల కోసం చదువుతూ వెళ్లడం వల్ల  టైం అంతా  వృధా అయిందని చెప్పుకొచ్చింది.

CHSL, CGL, NEET వంటి పరీక్షల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం ఒక ట్రాప్  లాంటిదని ఆమె హెచ్చరించింది. ఎందుకంటే అభ్యర్థులు లక్షల్లో ఉంటున్నారు, సీట్లు మాత్రం వేలల్లోనే ఉన్నాయి. ఈ పోటీలో పడకండి అని సూచించింది. ఉద్యోగం లేకపోతే  తనకు పెళ్లి చేసేస్తారని, తన కలలు మధ్యలోనే ఆగిపోతాయన్న భయాన్ని ఆమె వ్యక్తం చేసింది.

►ALSO READ | హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ దగ్గర భద్రత పెంపు.. స్టార్ హోటళ్లలో అనుమానిత వ్యక్తులపై నిఘా..
 
ఈ కాలంలో డిగ్రీల కంటే సొంత తెలివితేటలు, టాలెంట్  మనల్ని కాపాడతాయని ఆమె గట్టిగా చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తే.. అక్కడ అందరూ టాలెంట్ తోనే రాణిస్తున్నారు. అక్కడ ఎవరి డిగ్రీలు కనిపించవు, కేవలం వారి పనితనం మాత్రమే కనిపిస్తుంది అని అన్నారు. 

 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత  విలువైన 5-10 ఏళ్ల సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వాటికి బదులు కొత్త స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని కొందరు అంటున్నారు. మనం స్కూళ్లు, కాలేజీల్లో చదివే చదువుకు.. బయట ప్రపంచంలో అవసరమయ్యే పనికి అసలు సంబంధమే ఉండటం లేదు. మన విద్యా వ్యవస్థ ఒక వ్యాపారంలా మారిపోయింది అని మరికొందరు విమర్శిస్తున్నారు.