అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిరసనలు వెల్లువెత్తాయి. ఓల్డ్ సిటీలోని పురాని హవేలీలో వందల మంది ముస్లింలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నానక్ రామ్ గూడలోని యూఎస్ కాన్సులేట్ దగ్గర భద్రతా పటిష్టం చేశారు పోలీసులు. ఖమేనీ మృతి పట్ల నిరసన తెలుపుతూ సిటీ వ్యాప్తంగా ముస్లింలు ర్యాలీలకు పిలుపునిచ్చిన క్రమంలో యూఎస్ కాన్సులేట్ దగ్గర భద్రతా పటిష్టం చేశారు గచ్చిబౌలి పోలీసులు.
నానక్ రామ్ గూడలోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న స్టార్ హోటళ్లలో అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టారు పోలీసులు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు గచ్చిబౌలి పోలీసులు. ఇదిలా ఉండగా.. ఖమేనీ మృతి పట్ల నిరసన తెలుపుతూ ఓల్డ్ సిటీలో వందలాది మంది ముస్లింలు ర్యాలీ చేపట్టారు.
ఇజ్రాయెల్ ముర్దాబాద్, నేతన్యాహు మూర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు ముస్లింలు. భారీ సంఖ్యలో ముస్లిం మత పెద్దలు.. స్థానికులు ఈ నీరసనలో పాల్గొన్నారు.
