వారఫలాలు(మార్చి1–7):ఈ వారంలో చంద్రగ్రహణ ప్రభావం..ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి..పూర్తి వివరాలు ఇవే .

వారఫలాలు(మార్చి1–7):ఈ వారంలో చంద్రగ్రహణ ప్రభావం..ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి..పూర్తి వివరాలు ఇవే .

వారఫలాలు ( మార్చి 1–7): జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..  ఈ వారంలో మార్చి 3 వ తేదీన చంద్రగ్రహణం   ఏర్పడనుంది.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.  గ్రహణం  ఎఫెక్ట్​తో ఈ వారం 12 రాశుల వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. . .!

మేష రాశి:  ఈ రాశి వారికి ఈ వారం  అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  గతంలో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలలో మంచి లాభాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.   మొండి బకాయిలు వసూలవుతాయి. . ఇక ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  ప్రేమ..పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

వృషభరాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి . కుటుంబ వ్యవహారాలపై శ్రద్ద చూపాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది.  కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు ఉన్న కుటుంబసభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. వారం చివర్లో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

మిథునరాశి :  ఈ రాశి వారికి ఈ వారంలో  మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి.  కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.  వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.  ప్రేమ వ్యవహారాలు కాస్తంత ఇబ్బంది పెడతాయి.

కర్కాటకరాశి : ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం ప్రభావం ఈ రాశివారిపై అధికంగా ఉంటుంది.  కొంతమంది స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశాలున్నాయి.  ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోండి. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ వారంలో ఎట్టి పరిస్థితిలో కొత్త పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.  ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.

సింహ రాశి :  ఈ రాశి వారికిఈ వారం  అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని అవకాశాలువస్తాయని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.  సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. విలువైన వస్తువులు  కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాతమిత్రులతో కలిసి ఎంజాయి చేస్తాయి ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యల నుంచి బయటపడతారు.  లాభాల బాట పడతారునిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి  ప్రశంశలు వస్తాయి.  పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ప్రేమ వ్యవహారం చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

కన్య రాశి : ఈ రాశి వారికి కూడా గ్రహణ ప్రభావం ఉటుంది.  ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి ...  లాభాలలో ఆలస్యం జరుగుతుంది.  కొత్త పెట్టుబడుటకు చాలా దూరంగా ఉండండి. అనవసరమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.   ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్త అవసరం.  ఉద్యోగస్తుల విషయంలో పనిభారం పెరుగుతుంది.  ఆఫీసులో అనవసరంగా మాట పడాల్సి వస్తుంది.  గ్రహణం తరువాత దానం ఇవ్వండి.. అంతా మంచే జరుగుతుంది. 

తులా రాశి :  ఈ రాశి వారికి ఈ వారం  ఆర్థికంగా కలిసి వస్తుంది.  పూర్వీకుల ఆస్తి చేతికి అందుతుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​వచ్చేందుకు అడ్డంకులు తొలగిపోతాయి. ఊహించని విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్నీ విధాలా అనుకూలంగా ఉంటుంది. అప్పుల సమస్యలు పరిష్కారం కావడంతో  చాలా ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆఫర్​ లెటర్​ అందుకునే అవకాశం ఉందనిజ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృశ్చికరాశి : ఈ వారం ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా ఉండదు.  ప్రతి పని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు .. మీ ప్రమేయం లేకపోయినా అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది . అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో చికాకు వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది.  అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు.  కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు

ధనుస్సురాశి :  ఈ రాశి వారికి ఈవారంలో ఉద్యోగులు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి కల నెరవేరుతుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి.  ఎప్పటినుంచో అమ్ముడుకాని వస్తువులకు గిరాకీ వస్తుంది.  కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం.. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

మకరరాశి :  ఈ వారం ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల విషయంలో  ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో  కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. పాత  అప్పులు తీర్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి :  ఈరాశి వారికి ఈ వారం కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగినా.. సమయానికి పూర్తి చేస్తారు.  స్థిరాస్థి విషయంలో అడ్డంకులు తొలగుతాయి.  వృత్తి.. వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శ్రమకు ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది.

మీనరాశి:  ఈ రాశి వారికి ఈ వారం  ప్రతికూల ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాల గురించి పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు రావు. వృత్తి , ఉద్యోగాలలో ఇబ్బందులు పడే అవకాశం  ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు . ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.