ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్

ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలు,యువతులు, స్టూ డెంట్స్ ని ఈవ్ టీజింగ్ చేస్తున్న 64 మందిలో 33 మంది ఆకతాయిలకు శుక్రవారం ఎల్ బీనగర్ లోని కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ లో కౌన్సెలింగ్ ఇచ్చినట్టు సీపీ మహేశ్ భగవత్ చెప్పా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..6 వారాల్లో 64 మంది పోకిరీలు షీ టీమ్స్ కి పట్టుబడ్డారన్నారు. పట్టుబడ్డవారిలో 17 మంది మైనర్లు ఉన్నారన్నారు. పట్టుబడ్డ వారిలో 31 మందిపై క్రిమినల్ కేసులు..25 మందిపై పిట్టి కేసులు నమోదు చేశామన్నారు. మరో 8 మందికి ఆ సమయంలో కూడా కౌన్సెలిం గ్ ఇచ్చి వదిలేశామన్నారు. అయితే ఈ 64 మందిలో క్రిమినల్ కేసులు నమోదైన 31 మంది జైల్లో ఉన్నారన్నారు. మిగతా 33 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో భూమిక స్వచ్ఛంద సంస్థ సహకారాం తో కౌన్సెలిం గ్ ఇచ్చామన్నారు. ఈ 64 మందిలో ఉప్పల్ లో వేర్వేరు ప్రాంతాల వద్ద మహిళలు, కాలేజీ అమ్మాయిలు ఎక్కడైన ఈవ్ టీజింగ్ కి గురైతే 100నంబర్ కు ఫోన్ చేసి కానీ 9490617111నంబర్ కు వాట్సాప్ ద్వారా కానీ సమాచారం అందించా లన్నారు. ఈవ్ టీజింగ్ పై వారు ధైర్యం గా కంప్లయింట్ ఇవ్వొచ్చన్నారు. కంప్లయిం ట్ ఇచ్చిన వారి వివరాలను రహస్యం గా ఉంచుతామని సీపీ మహేశ్ భగవత్ చెప్పా రు.