ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం

ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఓఖ్లా ప్రాంతంలో ఉన్న ఓ బాంక్వెట్ హాల్‌లో మే 17వ తేదీ శుక్రవారం ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏడు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. 

ఈ ఘటనపై ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి మాట్లాడుతూ.. కల్కాజీ మెట్రో స్టేషన్ సమీపంలోని బాంక్వెట్ హాల్ దగ్గర అగ్నిప్రమాదం జరిగినట్లు సాయంత్రం 6.56 గంటలకు కాల్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపు తెచ్చామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.