కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే.. పాలమూరులో ఆ పరిస్థితి చూసి ఏడ్చినా: కేసీఆర్ 

కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే.. పాలమూరులో ఆ పరిస్థితి చూసి ఏడ్చినా: కేసీఆర్ 

2023 ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఆదివారం ( డిసెంబర్ 21 ) మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం సమయంలో పాలమూరులో పాదయాత్ర చేసినప్పుడు గంజి కేంద్రాలు చూసి ఏడ్చానని అన్నారు కేసీఆర్. యువకులంతా వలస వెళ్తే.. వృద్దులు ఆకలితో అలమటించేవారని..వేసవి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలవారు గంజి కేంద్రాలు పెట్టేవారని అన్నారు. కృష్ణానది 300 కీలకోమీటర్లు పారే పాలమూరు.. గంజి కేంద్రాలు నిర్వహించాల్సిన స్థాయికి దిగజారిపోయిందని అన్నారు కెసిఆర్.

తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత తన ఎజెండాలో మొదటిది జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసానని అన్నారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లోకాని తెలియజేసేందుకే పాదయాత్ర చేపట్టానని అన్నారు. ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు జూరాల లింక్ కెనాల్ ప్రారంభించి జనాన్ని ఏమార్చారని అన్నారు.

చంద్రబాబు ప్రతిసారి జనాన్ని దగా చేయడం తప్ప తెలంగాణకు చుక్క నీరు కూడా రాలేదని అన్నారు. పాలమూరు జిల్లా దరిద్రంలోకి నెట్టివేయబడ్డ ప్రాంతమని.. తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని.. వెనకకు నెట్టివేయబడ్డ ప్రణతామని అన్నారు కేసీఆర్. నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి దత్తత ఉన్నప్పటికీ పాలమూరుకు అన్యాయం జరిగిందని అన్నారు కేసీఆర్.

మహబూబ్ నగర్ జిల్లాను చంద్రబాబు నాయుడు దత్తత తీసుకుని ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కల్వకుర్తి.. మన్ను మశానం అంటూ.. పునాది రాళ్లు వేసుకుంటూ పోయారని.. కానీ ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలకు రాలేదని తెలిపారు. 

ఆ పునాది రాళ్లను కృష్ణా నదిలో అడ్డం వేస్తే చెక్ డ్యాం అయ్యేదని చమత్కరించారు కేసీఆర్.చంద్రబాబు హయాంలో ప్రతి నియోజకవర్గం నుంచి బొంబాయికి వలసలు వెళ్లే వారని అన్నారు. ప్రతి తాలూకా నుంచి ముంబైకి బస్సు ఉండేదని.. అంతి భయంకరమైన కరువు ఉండేదని అన్నారు.