ఢిల్లీ స్టేట్‌ యూనివర్సిటీల్లో అన్ని పరీక్షలు రద్దు

ఢిల్లీ స్టేట్‌ యూనివర్సిటీల్లో అన్ని పరీక్షలు రద్దు
  • ప్రకటించిన మనీశ్‌ సిసోడియా

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఫైనల్‌ ఇయర్‌‌ స్టూడెంట్స్‌కు కూడా పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ రూల్స్‌ను బట్టి డిగ్రీ ఇస్తామని అన్నారు. “ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ గవర్నమెంట్‌ పరిధిలోని పరీక్షలన్నీ వాయిదా వేయాలని నిర్ణయించాం. ఫైనల్‌ ఎగ్జామ్స్‌ కూడా రద్దు చేస్తున్నాం. స్టేట్‌ యూనివర్సిటీల్లోని టర్మినల్‌ ఎగ్జామ్స్‌, సెమిస్టర్స్‌కు కూడా ఇది వర్తిస్తుంది” అని సిసోడియా ట్వీట్‌ చేశారు. స్కూల్స్‌లోని 9, 11వ తరగతి స్టూడెంట్స్‌కు కూడా పరీక్షలు రద్దు చేయాలని డిసైడ్‌ అయ్యామని, ఈ మేరకు సెంటర్‌‌ కూడా సీబీఎస్‌ఈ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని సిసోడియా కోరారు. అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలను కూడా రద్దు చేయాలని సీఎం కేజ్రీవాల్‌ కేంద్రానికి లెటర్‌‌ రాస్తారని సిసోడియా అన్నారు. కేజ్రీవాల్‌ కరెక్ట్‌ టైంలో కరెక్ట్‌ డెసిషన్‌ తీసుకున్నారని సిసోడియా అన్నారు. ఇప్పటికే జాబ్స్‌వచ్చిన స్టూడెంట్స్‌ డిగ్రీ కలెక్ట్‌ చేసుకుని ఉద్యోగాల్లో చేరాలని సూచించారు.