ఎకో ఫ్రెండ్లీకే ఇంట్రెస్ట్..సీడ్ గణేశ్ కి క్రేజ్

ఎకో ఫ్రెండ్లీకే ఇంట్రెస్ట్..సీడ్ గణేశ్ కి క్రేజ్

ఓ వైపు కరోనా, మరోవైపు ఎన్విరాన్మెంట్ పై అవేర్నెస్ తో మట్టి గణపతులకు డిమాండ్ పెరుగుతోంది. కిందటేడుతో చూస్తే ఈసారి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను కొనేందుకు సిటిజన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వివిధ సంస్థలు, స్టార్టప్ లు మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్నాయి. ఎక్కు వ మంది సీడ్ తో ఉండేవి కొంటున్నట్లు తయారీ దారులు చెప్తున్నారు. గణపతితో పాటు కుండీ,పూజా సామగ్రిని ప్యాకేజీలో అందిస్తున్నారు.

అవేర్నెస్ పెరుగుతుండటంతో…

గణే శ్ ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు పెట్టాలని పర్యావరణ వేత్తలు ఎప్పటినుంచో కోరుతున్నా.. ఎక్కువ మంది ప్లాస్ట ర్ఆఫ్ పారిస్తో చేసినవాటినే కొనేవారు. వోకల్ ఫర్ లోకల్, గ్రీన్ ఛాలెంజ్లు పెరుగుతున్న టైమ్లో ప్రజల్లో వస్తున్న అవగాహనతో ఈ సారి మట్టి గణనాథులకు క్రేజ్ పెరిగింది. కరోనా వల్ల వీధుల్లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరిపే పరిస్థితిలేక పోవడమూ ఓకారణం.మట్టి గణపతి అయితే ఇంట్లోనే పూజలు చేసి కుండీలో నిమజ్జ నం చేయొచ్చని భావిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఎకోఫ్రెండ్లీ గణపతులను పూజించాలని సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ చేస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్,ఎకో ఫ్రెండ్లీ ప్రాడక్స్ ట్యూజ్ చేయాలని సినీ యాక్టర్స్ సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా కోరారు. బాలీవుడ్ సెలబ్రెటీలు శ్రద్ధాకపూర్, టైగర్ష్రాఫ్,యామీగౌతమ్ కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను ప్రతిష్టించాలని కోరుతున్నారు.

మట్టి గణపతికే మొగ్గు ..

సిటీవ్యాప్తంగా మట్టి గణపతులను తయారుచేసి అమ్మేవారు ఎందరో ఉన్నారు. మాములుగా ఏటా 5వేల నుంచి 6వేల విగ్రహాలు అమ్ముడుపోతుండగా, ఈసారి సేల్స్ రెండింతలు పెరిగాయని తయారీదారులు చెప్తున్నారు. సీడ్ విగ్రహాలు ఎక్కు వ మంది అడుగుతున్నట్లు తెలిపారు. విగ్రహం తయారుచేసేప్పుడే అందులో సీడ్ పెడతారు. ఆ విగ్రహంతో పాటు కుండీ, కోకోపిట్ అటాచ్ చేసి ఇస్తారు. పూజల తర్వాత కుండీలో నిమజ్జనం చేస్తే అందులో నుంచి మొక్క వస్తుంది. మామూలు మట్టి గణపతులనూ కుండీల్లో ఈజీగా నిమజ్జనం చేసుకోవచ్చు. ఒకప్పుడు విగ్రహం మాత్రమే అమ్మే తయారీదారులు ఇప్పుడు కుండీలు,పూజా సామగ్రిని కూడా కలిపి అందిస్తున్నారు. తాము కిందటేడు 11వేల విగ్రహాలు సేల్ చేస్తే ఈ సారి 15వేలకు పైగా విగ్రహాలు సేల్ చేశామని ప్లాన్ఏ ప్లాంట్ సంస్థ నిర్వాహకురాలు దివ్య తెలిపారు.

జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో..

జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం మట్టి గణపతి వి గ్రహాలను పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ద్వారా లక్ష విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్లతోపాటు మొబైల్ వెహికల్స్ ద్వారా కాల‌‌నీల్లో అందిస్తామన్నారు. వినాయక చవతి ప‌‌ర్యావరణహితంగా జ‌‌రుపుకోవాలని కోరారు. స్టాండింగ్ కమిటీ మెంబర్స్ స్వప్న,కార్పొరేటర్ మమత,శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ రాహుల్ రాజ్‌‌, హెచ్‌‌ఎండీఏ ఎస్‌‌ఈపరం జ్యోతి పాల్గొన్నారు.

రెస్పాన్స్ బాగుంది

మేము ప్లాంట్ గణేష్లను కొన్నేండ్లుగా తయారీచేసి అమ్ముతున్నాం. ఈసారి రెస్పాన్స్ చాలా బాగుంది. 1.5 శాతం బిజినెస్ పెరిగింది. ఇప్పటి వరకు 15వేలకుపైగా విగ్రహాలను సేల్ చేశాం. 5 ఇంచెస్ గణపతిని రూ.399కి పాట్ తో అందిస్తాం. 7 ఇంచుల గణేశ్ను రీసైకిల్ పాట్ తో 699కి ఇస్తున్నాం .

– దివ్య, ప్లాన్ ఏ ప్లాంట్