Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం..ఆ జాబితాలో తొలి భారతీయ నటిగా గుర్తింపు

Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం..ఆ జాబితాలో తొలి భారతీయ నటిగా గుర్తింపు

నార్త్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా మారిపోయింది. అంతేకాదు 2023 ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతలలో ఒకరుగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఎంతో ఫేమస్ అయ్యారు.ఆస్కార్ వేదికపై RRR మూవీకి అవార్డు ప్రకటించే ముందు తన ప్రసంగంతో భారతదేశాన్ని గర్వించేలా చేసింది. ఇప్పటికి ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికలపై పాల్గొని తన అందంతో..తన మాటలతో వరల్డ్ వైడ్ గా మరోసారి గుర్తింపు పొందింది. 

తాజాగా డెడ్‌లైన్స్‌ గ్లోబల్‌ డిస్‌రప్టర్స్‌(Deadline Global Disruptors) అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం కూడా వినోదాత్మక రంగంలో రాణిస్తున్న ప్రముఖుల జాబితాను సైతం విడుదల చేస్తూ ఉంటుంది.2024కి గాను బాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ను పొందుతున్న బ్యూటీ దీపికా పదుకొనేకు ఈ హాలీవుడ్ మ్యాగజైన్ పై చోటు లభించింది. అయితే, ఇండియాలో ఇంతటి గౌరవం పొందిన ఏకైక నటి దీపికా పదుకొణె కావడం విశేషం..ఈ విషయాన్ని స్వయంగా దీపికా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..కొన్ని ఆసక్తికర విషయాల్ని తన అభిమానులతో పంచుకుంది. "బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ నన్ను చాలా మంది ప్రేక్షకుల ఆదరిస్తున్నారు. పదేళ్ల క్రితం నేను హాలీవుడ్‌ సినిమాలకు ఆడిషన్‌ ఇచ్చా. అక్కడంతా కొత్త విధానం. అక్కడి సినిమాలోని నటనకు తగ్గట్టు నేను ఏ విధమైన ఫాన్సీ యాక్టింగ్‌ స్కూల్లో చేరలేదు, ఎలాంటి ఇంగ్లిష్‌ నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ ఒక్కసారి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లిష్‌ సినిమాలకి తగ్గ నైపుణ్యాలను త్వరగా నేెర్చుకున్నానని" దీపికా పదుకునే వెల్లడించింది.

ఇక దీపికా ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్టులలో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 AD మూవీ ఒకటి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. కల్కి సినిమా కోసం దీపికా ఏకంగా రూ.20 కోట్లు పోరితోషికంగా అందుకుంటుందట. గతంలో ఒక్కో సినిమాకు రూ.12 నుండి  రూ.15 కోట్ల వరకు తీసుకున్న దీపికా.. కల్కి కోసం రూ.20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. హిందీలో ‘సింగమ్ రిటర్న్స్’ సినిమాల్లో చేస్తూనే..మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేసింది.