మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

మల్కాజిగిరి లక్ష్మీ సాయి గార్డెన్ లో పేదలకు నిత్యావసర సరుకులను మైనంపల్లి సేవాసమితి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు సంస్థ నిర్వహకులు రోహిత్ మైనంపల్లి, మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా మల్కాజిగిరి నియోజికవర్గంలో కేసీఆర్ పిలుపు మేరకు గత 67 రోజులుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున నియోజికవర్గంలో ఉన్న వలస కూలీలు ప్ర‌తీ ఒక్క‌రికి 12 కిలోల బియ్యం, 500 వందల రూపాయల నగదు అందజేశామన్నారు. దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎవరూ చేయలేదని, లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు చొరవ తీసుకుని 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.

శానిటేషన్ సిబ్బందికి 7 వేల రూపాయలు, వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు జీతాన్ని సీఎం అందించారన్నారు. లాక్ డౌన్ సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు మల్కాజిగిరి నియోజకవర్గంలోని 9 డివిజన్లలో సుమారు ఐదు వేల క్వింటాళ్ల బియ్యం, పప్పులు, నూనెలు ఇతర నిత్యావసరాను అందజేశామని , నియోజకవర్గం పరిధిలోని ప్రతీ కాలనీలో హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయడం జరిగిందన్నారు. పేదలు ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా కుల,మత, రాజకీయాలకు అతీతంగా సహాయం చేయడం జరిగిందన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో కంటైన్మెంట్ జోన్లలో పోలీసులు, జి.హెచ్.ఎం.సి, వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. అలాగే కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు.