జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
  • గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్
  •  ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు
  • ‘ధరణి’ కమిటీ  కీలక నిర్ణయం
  •  ఆ తర్వాతే సర్కారుకు నివేదిక
  •  ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు

హైదరాబాద్: ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇవాళ సచివాలయంలో ఏర్పాటైన కమిటీ రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలపై చర్చించింది. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రెండున్నర లక్షల ఫిర్యాదులను గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కమిటీ పెండింగ్ లో ఉన్నవాటిని సాల్వ్ చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో ఇప్పటి వరకు లక్షన్నర ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. లక్ష కంప్లయింట్స్ పెండింగ్ లో ఉన్నాయి. 

ధరణి పోర్టల్ లో 119కి  విభాగాల్లో తప్పులున్నాయని,  76 మాడ్యూల్స్ మారిస్తే సమస్యలను పరిష్కరించవచ్చని కమిటీ భావిస్తోంది. వీటిని అడ్డంగా పెట్టుకొని గత ప్రభుత్వ పెద్దలు నిషేధిత, అసైన్డు భూములను తమ పేరిట బదలాయించుకున్నారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీలపైనా ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం పెద్దలు తమ పేరిట బదలాయించుకున్న భూములపై ఆరా తీస్తోంది. ఈ కమిటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.