
U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ఇమ్మిగ్రేషన్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించింది.
చికాగోలోని ఫెడరల్ కోర్టు నేరారోపణ ప్రకారం..నలుగురు వ్యక్తులు భిఖాభాయ్ పటేల్, నీలేష్ పటేల్, రవినాబెన్ పటేల్ , రజనీ కుమార్ పటేల్..పార్త్ నాయీ, కెవాంగ్ యంగ్ అనే మరో ఇద్దరితో కలిసి బాధితులుగా ఏర్పడ్డారు. తద్వారా వారు U-Visa కోసం దరఖాస్తులను సమర్పించారు.
U-Visa అంటే..
U-Visa అనేది మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం కేటాయించిన వీసా. ఇది విచారణ లేదా ప్రాసిక్యూషన్‌లో చట్ట అమలుకు లేదా ప్రభుత్వ అధికారులకు సహాయపడుతుంది. ఈ వీసా కుంభకోణంలో పాల్గొనేందుకు నలుగురు వ్యక్తులు పార్త్ నాయీకి వేల డాలర్లు చెల్లించారని అభియోగపత్రంలో పేర్కొంది యూఎస్ కోర్టు.
వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటన చేసినందుకు రవినాబెన్ పటేల్‌పై వ్యక్తిగతంగా కూడా అభియోగాలు మోపారు. కుట్ర అభియోగంపై ఫెడరల్ జైలులో గరిష్టంగా ఐదేళ్ల శిక్ష, రవినాబెన్ పటేల్‌పై తప్పుడు ప్రకటన అభియోగంపై పదేళ్ల వరకు శిక్ష పడొచ్చని తెలుస్తోంది.