ఒక్కో హిందువు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలి:మాజీ హీరోయిన్, మాజీ ఎంపీ పిలుపు

ఒక్కో హిందువు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలి:మాజీ హీరోయిన్, మాజీ ఎంపీ పిలుపు

మాజీ సినీనటి, మాజీ ఎంపీ , బీజేపీ నేత నవనీత్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి భారతీయుడు ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలని సూచించారు. కొందరు వక్తులు ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా హిందుస్తాన్ ను పాకిస్తాన్ లా మార్చాలని చూస్తున్నారు. వారి కుట్రలను భగ్నం చేయాలని నవనీత్ కౌర్ రాణా అన్నారు. హిందుస్తాన్ ను పాకిస్తాన్ గా మార్చేందుకు కొంతమంది చేస్తున్న కుట్రను ఎదుర్కొవాలంటే హిందువులు కనీసం ముగ్గురు లేదా నలుగురు పిల్లల్ని కనాలని అన్నారు. 

కొంతమంది వ్యక్తులు తమకు నలుగురు భార్యలు, 19 మంది పిల్లలున్నారని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. హిందువులు కనీసం నలుగురు పిల్లల్ని కనాలని మేం పిలుపుస్తున్నామని నవనీత్ రాణా అన్నారు. కొందరు పెద్ద సంఖ్యలో పిల్లలకు కనడం ద్వారా హిందూస్థాన్‌ను పాకిస్తాన్‌గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు..కాబట్టి మనం ఒక్క బిడ్డతో ఎందుకు సంతృప్తి చెందాలి? మనం కూడా ముగ్గురు నుండి నలుగురు పిల్లలకు జన్మనివ్వాలి అని రాణా చెప్పుకొచ్చారు.