యాదాద్రి, వెలుగు: అగ్ని ప్రమాదంలో ఇల్లుతో పాటు నగదు కాలిపోవడంతో నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి యాదాద్రి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. సగం కాలిన నోట్లను ఆర్బీఐకి పంపించి మంచి నోట్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన సంగి స్వామి అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్తో పాటు ఇంట్లో ఉన్న రూ. 2.50 లక్షల నగదు కూడా కాలిపోయింది.
ఈ మొత్తంలో కొన్ని నోట్లు పూర్తిగా కాలిపోగా మరికొన్ని సగం వరకూ కాలిపోయాయి. దీంతో అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావును సంగి స్వామి ఆశ్రయించారు. దీంతో లీడ్ బ్యాంక్ ఆఫీసర్ను పిలిపించి కాలిపోయిన నోట్లను చూపించారు. నోట్లపై నెంబర్ఉండి సగం కాలిన వాటికి నగదు ఇచ్చే అవకాశం ఉందని ఆఫీసర్ తెలిపారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించాల్సిఉంటుందని చెప్పారు. దీంతో సగం కాలిన నోట్ల నెంబర్లను రాయడంతో నోట్లను ఆర్బీఐకి పంపించడానికి చర్యలు తీసుకున్నారు.
