‘ఇందిరమ్మ’తో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

‘ఇందిరమ్మ’తో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని..  పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే సర్కారు లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్​జిల్లా గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో కొండయ్యపల్లికి- 4, ఇస్లాంపూర్​కు -2, రంగారావుపల్లికి- మంజూరైన ఒక ఇందిరమ్మ ఇంటి పత్రాలను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చొప్పదండి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, రానున్న రోజుల్లో మరిన్ని  కేటాయిస్తామని పేర్కొన్నారు. ఎంపీడీవో దమ్మని రాము, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిరుత మంగ, సింగిల్ విండో చైర్మన్ తిరుమల్​రావు, డీసీసీ ఉపాధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

నిధులు కేటాయించాలని వినతి

బోయినిపల్లి, వెలుగు: గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ బోయినిపల్లి మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్​లు మంగళవారం కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి విన్నవించారు. మండలంలోని దుండ్రపల్లి, మర్లపేట గ్రామాల సర్పంచ్​లతో పాటు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను కలిసి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే గ్రామాల అభివృద్ధి ఎజెండాగా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, జంగం అంజయ్య, మండల మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఉపేందర్ తదితరులు ఉన్నారు.