- సీఎం ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి ‘రాష్ట్ర హోదా’ సాధించడమే మొదటి అడుగు అని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ప్రకటించారు. మంగళవారం శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తమ పోరాటానికి సోమవారం ఢిల్లీలో నిర్వహిం చిన నిరసన ఆరంభం మాత్రమేనని అన్నారు. "రాష్ట్ర హోదా లేనప్పుడు ఆర్టికల్ 370 లేదా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం నిరుపయోగం. కేంద్ర పాలిత ప్రాంతంలో రాజ్భవన్దే రాజ్యమని, కాబట్టి ముందుగా రాష్ట్ర హోదా సాధించి ‘రాష్ట్ర జాబితా’ను దక్కించుకుంటే, ఆ పునాదిపై ప్రత్యేక హోదాను పునర్నిర్మించుకోగలం" అని వివరించారు.
