2025లో ట్రెండ్ సెట్టర్ బిర్యానీ..9 కోట్ల30లక్షల ఆర్డర్లతో టాప్

2025లో ట్రెండ్ సెట్టర్ బిర్యానీ..9 కోట్ల30లక్షల ఆర్డర్లతో టాప్

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ లొట్టలేసుకుంటూ తింటుంటారు భోజన ప్రియులు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా బిర్యానీ వంటకానికి మంచి క్రేజ్ ఉంది. అందుకే దేశంలో అత్యధికంగా తిన్న ఫుడ్స్ లో బిర్యానీ టాప్ లో నిలిచింది. ఉత్తుత్తుగనే చెప్పడం కాదు.. లెక్కలేసి మరీ చెబుతున్నాయి  ఫుడ్ డెలివరీ సంస్థలు..స్విగ్గీ దేశవ్యాప్తంగా తాను డెలివరీ చేసిన ఫుడ్స్ డేటా లెక్కల రిపోర్టు హౌ ఇండియా స్విగ్గీ'డ్ ని  ప్రకటించింది..అందులో భారతీయుల మనసు దోచుకున్న ఫుడ్ గా బిర్యానీ టాప్ లో నిలిచింది. ఏకంగా 9కోట్ల 30 లక్షల ఆర్డర్లతో 2025లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాల్లో బిర్యానీ టాప్ లో ఉంది. 

2025లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 194 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయని స్విగ్గీ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఏడాది మొత్తం మీద స్విగ్గీ ద్వారా 9.3 కోట్ల బిర్యానీలను భారతీయులు ఇష్టంగా తిన్నారు. ఇందులో చికెన్ బిర్యానీలో ఎక్కువగా ఉండటం విశేషం. గుమగుమలాడే మసాలతో తయారయ్యే అద్భుతమైన వంటకం..భారతీయులు ఏళ్ల తరబడి  ఇష్టంగా తింటున్నారని స్వి్గ్గీ తన రిపోర్టులో చెబుతోంది. 

►ALSO READ | ఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఇక ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్డ్ లిస్ట్‌లో టాప్ 4 డిషెష్ లో బిర్యానీ మొదటి స్థానంలో ఉంటే..4.42 కోట్ల ఆర్డర్లతో రెండో స్థానంలో బర్గర్ ఉంది. 4.01 కోట్ల ఆర్డర్లతో పిజ్జా మూడో స్థానంలో నిలవగా.. వెజ్ దోశ 2.62 కోట్ల ఆర్డర్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ ఫుడ్స్ ఆర్డర్లలో మధ్యాహ్న భోజన ఆర్డర్ల కంటే డిన్నర్ ఆర్డర్లు దాదాపు 32 శాతం ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు మలబారి, రాజథాని, మాల్వానీ వంటి ఇతర ప్రాంతీయ వంటకాలలో ఆర్డర్లు కూడా  ఈ ఏడాది దాదాపు 2 రెట్లు పెరిగాయి అని స్విగ్గీ రిపోర్టు పేర్కొంది.