ఇదేం ఆలోచనరా బాబూ : డబ్బు వేస్ట్ చేయకూడదని బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

 ఇదేం ఆలోచనరా బాబూ : డబ్బు వేస్ట్ చేయకూడదని బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

ఇది చిత్రం అనాలో.. విచిత్రం అనాలో.. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో అర్థం కావటం లేదు.. మమ్మీ, డాడీ మీ డబ్బును వృధా చేయటం నాకు ఇష్టం లేదంటూ.. బీటెక్ చదువుతున్న ఓ స్టూడెంట్.. తన హాస్టల్ గదిలో ఊరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. షాకింగ్ గా ఉన్న ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ పేరు ఆకాష్ దీప్. గ్రేటర్ నోయిడాలోని ఢిల్లీ టెక్నికల్ క్యాంపస్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు..  ఏమైందో ఏమో.. తన హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. గదిలో సూసైడ్ నోట్ దొరికింది. దానిలో ఇలా ఉంది.. 

మమ్మీ, డాడీ నన్ను క్షమించండి. నేను మీ డబ్బును వృధా చేయకూడదు అనుకుంటున్నాను.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇంటర్ లో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా.. ఆశించిన స్థాయిలో మార్కులు తెచ్చుకుంటానన్న నమ్మకం లేదు. మీ ఆశలు, అంచనాలు అందుకోలేను అనుకుంటున్నాను. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఇలాగే చదువుకుంటూ మీ డబ్బులను వృధా చేయకూడదు అనుకుంటున్నాను.. నా చావుకు నేను బాధ్యుడిని.. ఎవరి ప్రమేయం లేదు.. ఎవర్నీ తప్పు పట్టొద్దు అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి.. ఫ్యాన్ కు ఉరి వేసుకుని చచ్చిపోయాడు. 

ALSO READ : ఆమెను ఉద్యోగం నుంచి తీసేయండి.. 

సూసైడ్ నోట్ బయటపడిన తర్వాత.. ఆకాష్ చదువు ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఆకాష్ పై పేరంట్స్ పెద్దగా ఆశలు పెట్టుకోవటం.. మంచి ర్యాంక్.. మంచి ఉద్యోగం కోసం ఒత్తిడికి గురైనట్లు స్పష్టం అవుతుంది. పేరంట్స్ ఆలోచనలకు తగ్గట్టు చదవలేకపోతున్నాను అనే బాధ, భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. చదువులో ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు నోట్ ద్వారా తెలుస్తుందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఏదిఏమైనా చదువుపై ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పొచ్చు కదా.. ఓ బీటెక్ స్టూడెంట్ ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఫ్రెండ్స్, కాలేజీ స్టాఫ్ ను ఆవేదనకు గురి చేస్తుంది. జీవితం అంటే చదువు, ర్యాంకులు, ఉద్యోగం ఒక్కటే కాదు కదా అంటూ మానసిక నిపుణులు. చదువు, ఉద్యోగం విషయంలో పిల్లలపై.. తల్లిదండ్రుల ఒత్తిడి తగ్గించాలని.. వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని సూచిస్తున్నారు మానసిక నిపుణులు.