బంగ్లాదేశ్ దేశం.. అరాచకానికి సింబల్ గా మారిపోయింది. ఆరు నెలలుగా రగులుతున్న బంగ్లాదేశ్ అల్లర్లు ఇప్పుడు కొత్త రూపులోకి మారాయి. మీడియాను టార్గెట్ చేస్తున్నాయి ఆందోళన గ్రూపులు. మొన్నటికి మొన్న ది డైలీ స్టార్, ప్రోథోమ్ అలో అనే రెండు మీడియా ఆఫీసులను తగలబెట్టిన ఆందోళనకారులు.. ఇప్పుడు మరో లేడీ యాంకర్ విషయంపై రగలిపోతున్నారు.
ఇంతకీ ఆ లేడీ యాంకర్ ఎవరు అంటారా.. ఆమె పేరు నజ్నిన్ మున్నీ. ఆమె గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ జర్నలిస్ట్. టాప్ యాంకర్. ప్రైమ్ టైంలో వస్తుంది. పాపులర్ కూడా. మున్నీని ఉద్యోగం నుంచి తీసేయాలని లేకపోతే మీ గ్లోబల్ టీవీని తగలబడెతాం.. కాల్చిపారేస్తాం అంటూ ఏకంగా మేనేజ్ మెంట్ కు వార్నింగ్ ఇచ్చారు ఆందోళనకారులు.
ఇంతకీ యాంకర్ మున్నీ అంటే ఎందుకు వీళ్లకు కోపం అంటే.. ఈమె షేక్ హసీనా పార్టీకి చెందిన సానుభూతిపరురాలు అంట. బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్న ఆందోళనలపై చేస్తున్న వ్యాఖ్యలు, డిస్కషన్స్ నెగెటివ్ గా ఉన్నాయంట. దేశంలో జరుగుతున్న అల్లర్లు, గొడవలకు కారణాలు ఇవీ అంటూ చెబుతున్నదంట. దీంతో మండిపోతున్న అక్కడి జనరేషన్ జెడ్ గ్రూపుల్లోని కొందరు.. గ్లోబల్ టీవీకి వార్నింగ్ ఇచ్చారు. యాంకర్ మున్నీని ఉద్యోగం నుంచి తీసేయాలని.. ఆఫీసుకు వచ్చి మరీ బెదిరించారంట.
ALSO READ : నాణ్యమైన గాలి ఇవ్వలేరా..?
ఇప్పటికే రెండు మీడియా ఆఫీసులను తగలబెట్టిన ఆందోళనకారులు.. అంతకు తెగించినా ఆశ్చర్యం లేదనే భయంతో ఉంది గ్లోబల్ టీవీ యాజమాన్యం. అలా అని యాంకర్ ను తొలగిస్తే.. రాబోయే రోజుల్లో మరిన్ని బెదిరింపులతోపాటు.. ఏం చెబితే అది రాయాల్సి ఉంటుంది.. అది మరింత దిగజారినట్లు అవుతుంది.. దేశంలో నియంతృత్వం పెరిగిపోతుంది.. ఆందోళనకారులకు అడ్డా అదుపు లేకుండా పోతుందనే మరో భయం, మరో కోణాన్ని కూడా యాజమాన్యం పరిశీలిస్తుందంట.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని పరిస్థితుల క్రమంలో.. అల్లర్లు, గొడవలు సద్దుమణిగే వరకు యాంకర్ మున్నీని స్క్రీన్ పై కనిపించకుండా ఉంటేనే బెటర్ అనే ఆలోచన చేస్తుందంట యాజమాన్యం. బెదిరింపులను లైట్ తీసుకుంటే.. ఆమెపై వ్యక్తిగతంగా దాడులు చేస్తే పరిస్థితి ఏంటీ అనే భయం కూడా వెంటాతుందంట.
బంగ్లాదేశ్ లో మీడియా హౌస్ ల టార్గెట్ గా సాగుతున్న ఈ పరిణామాలపై అక్కడి మేధావులు, న్యూట్రల్ పీపుల్, వివిధ సంఘాలు ఆందోళనగా ఉన్నాయి. దేశంలో పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
