నా భార్యకు సీక్రెట్ లవర్ ఉన్నాడు: లక్షల కోట్లు ఆస్తులు ఉన్న జెఫ్రీ లీడ్స్ డైవర్స్ పిటీషన్

నా భార్యకు సీక్రెట్ లవర్ ఉన్నాడు: లక్షల కోట్లు ఆస్తులు ఉన్న జెఫ్రీ లీడ్స్ డైవర్స్ పిటీషన్

వాషింగ్టన్: వాల్ స్ట్రీట్ దిగ్గజం, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్రీ లీడ్స్ ఆయన భార్య ఎలిజబెత్ లీడ్స్‌ మధ్య విడాకుల కోసం న్యాయ పోరాటం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన భార్యపై జెఫ్రీ లీడ్స్ సంచలన ఆరోపణలు చేశాడు. మయామి వ్యాపారవేత్త ఆల్బర్టో అలెజాండ్రో టావిల్ (66)తో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని.. అతడి వల్ల గర్భం కూడా దాల్చిందని ఆరోపించాడు. తాను లేనప్పుడు తన భార్య, టావిల్ రహస్యంగా కలిశారని పేర్కొన్నాడు.

 టావిల్ ఒక నిజాయతీ లేని.. విఫలమైన రియల్ ఎస్టేట్ మొగల్ అని అభివర్ణించాడు. నష్టాల్లో కూరుకుపోయిన టావిల్‎కు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి నా భార్య నా డబ్బులు ఖర్చు పెట్టిందని ఆరోపించాడు. మొజాంబిక్‌లోని టావిల్ వ్యాపారాలలో భారీగా పెట్టుబడులు పెట్టిందని చెప్పాడు. అంతేకాకుండా టావిల్ ఇంటి పని మనుషులు 21 మందికి నా భార్య జీతాలు చెల్లించిందన్నాడు. సెక్స్ టాయ్స్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిందని ఆరోపించాడు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‎లో జెఫ్రీ లీడ్స్ ఈ ఆరోపణలు చేశాడు.

అన్నీ తప్పుడు ఆరోపణలే: ఎలిజబెత్ లీడ్స్ 

భర్త జెఫ్రీ లీడ్స్ ఆరోపణలను ఎలిజబెత్ లీడ్స్ తీవ్రంగా ఖండించింది. జెఫ్రీ తనపై ఆర్థిక యుద్ధం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వరుసగా నోటీసులు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. తన స్నేహితులు టావిల్, న్యూయార్క్ వజ్రాల వ్యాపారి అన్నే బేకర్‎ను తన భర్తతో టార్గెట్ చేశాడని పేర్కొంది. 

తన పిల్లలను కలిసేందుకు వెళ్లిన సమయంలో కూడా బహిరంగంగా జెఫ్రీ తనను వేధించాడని ఆరోపించింది. నా పరువుకు భంగం కలిగించేలా నా ప్రైవేట్ ఫొటోలను కూడా జెఫ్రీ లీక్ చేశాడని పేర్కొంది. విడాకుల కేసు విచారణ కోర్టులో ఉన్నప్పటికీ తనను భయభాంత్రులకు గురి చేస్తు్న్నాడని ఆమె వాపోయింది. కాగా, జెఫ్రీ, ఎలిజబెత్ మధ్య 100 మిలియన్ల డాలర్లకు పైగా ఆస్తులకు సంబంధించిన విడాకుల పిటిషన్‎పై కోర్టులో విచారణ జరుగుతోంది.