జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... రాజ గ్రహాలైన సూర్యుడు.. కుజుడు అనుకూల స్థానాల్లో సంచరిస్తున్న రాశుల వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఏడాది(2026)లో ఆరు రాశుల(మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం) వారికి ఈ గ్రహాలు శుభ స్థానాల్లో సంచరిస్తాయని పండితులు చెబతున్నారు. ఈ రాశుల వారికి ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తీరుతాయని..ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఆశించిన జాబ్ వస్తుందని పండితులు చెబుతున్నారు.ఈ స్టోరీలో ఆ రాశుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. . .!
మరో కొద్ది రోజుల్లో 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాది 2026 వ సంవంత్సరం ప్రారంభం కానుంది. జ్యోతిష్య నిపుణులు నవగ్రహాల స్థానాలు.. ఏ రాశిలో ఉన్నాయి.. ఏ నక్షత్రంలో ఉన్నాయి ఎవరికి ఎలా ఉంటుంది.. ఇంకా అనేక విషయాల గురించి చెబుతున్నారు.
మేషరాశి: ఈ రాశి వారికి కుజుడు మంచి ఫలితాలను కలుగజేస్తాడు. సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తప్పకుండా ఘన విజయాలు సాధించడం జరుగుతుంది బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నించడం కూడా మంచిది. వీరికి సొంత ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ప్రతిఫలం పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు .. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు.
కర్కాటకం: ఈ రాశి వారికి 2026 జనవరి 15 నుంచి కుజుడు.. సూర్యుడు అనుకూలంగా మారడం వల్ల ఈ రాశివారు ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిదని పండితులు చెబుతున్నారు. . ఎటువంటి పోటీ పరీక్షలు, రాత పరీక్షల్లోనైనా వీరు నెగ్గే అవకాశం ఉంది. 2026 జూన్ నుంచి గురువు ఇదే రాశిలో కి రావడం వలన ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు ఆనందంగా గడుపుతారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
సింహరాశి: సూర్యుడు.. కుజుడు 2026 జనవరి నుంచి అనుకూలంగా మారడం వల్ల ఈ రాశి వారు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. జూన్ లోపు వీరి కల సాకారం అవుతుంది. గురువు అనుకూలత వల్ల వీరికి కోరిక నెరవేరుతుంది.సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు ఆనందంగా గడుపుతారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
వృశ్చికరాశి: సూర్యుడు.. కుజుడు మిత్ర స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి రాజయోగం పట్టే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది. వేతనం పెరగడం.. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ రావడం.. కావలసిన ప్రదేశానికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్ లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు వృద్ది చెందుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు.. బిజినెస్ ను విస్తరించే అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి: ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నించే ధనస్సు రాశి వారికి 2026 జూన్‌లోపు జాబ్ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే జాబ్ లో ఉండి ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి వారికి కల సాకారం అవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు అధిక లాభాలను పొందుతారు. కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి: కొత్త సంవత్సరంలో (2026) ఈ రాశి వారికి ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సీనియర్ అధికారులు .. ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. కొత్త దంపతులు ఎంజాయి చేస్తారు. కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
