ఆదివారం సెలవు రోజు.. ఆ రోజు చాలా పనులు చేసుకొనేందుకు ప్లాన్ వేసుకుంటారు. కాని పురాణాల ప్రకారం.. ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయడబడిన రోజు. ఆరోజు కొన్ని పనులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఆరోజు హాలిడే అని చాలా మంది షేవింగ్.. కటింగ్ చేయించుకుంటారు. కాని అలా చేస్తే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడతారని పండితులు చెబుతున్నారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం అసలు ఆదివారం ఎలాంటి పనులు చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పురాణాల ప్రకారం . ఆదివారం .. . సూర్య నారాయణుడికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున కొన్ని నియమాలను పాటించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆరోజు కొన్ని పనులను ఎట్టిపరిస్థితిలో చేయకూడదని పండితులు చెబుతున్నారు. అందుకే ఆదివారం కొన్ని కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. ఆధ్యాత్మిక వేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం షేవింగ్.. కటింగ్ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులతో పాటు జీవిత సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు.
ALSO READ : గుండెపోటు వచ్చినప్పుడు.. మంచినీళ్లు ఇవ్వడం సురక్షితమేనా?
హిందూ మతంలో వారంలోని ప్రతి రోజును ఏదో ఒక దేవీదేవతలకు అంకితం చేయడం జరిగింది. ఆదివారం రోజున సూర్యుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మాఘ మాసం .. శుభ మాసం జరుగుతోంది. ఈ నెలలో సూర్య ఆరాధన మరింత ఫలవంతమైనది పండితులు చెబుతున్నారు.
ఆదివారం తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం.. సూర్యాష్టకం పఠించాలి. సూర్యునికి ఎదురుగా నిలబడి.. దోసెలతో నీళ్లు తీసుకొని సూర్యునికి చూపించి.. ఒక ప్లేట్ లో వదలాలి. ఇలా చేయడం వలన సూర్య భగవానుడి ఆశీస్సులతో పాటు పితృదేవతల శాపం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.
ALSO READ : వ్యాపారంలో నష్టాలా..శనివారం ఇలా చేయండి.!
పురాణాల ప్రకారం.. ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి.
ఇనుము వస్తువులను కొనొద్దు : ఆదివారం నాడు ఇనుముతో చేసిన ఏ వస్తువునూ కొనకండి. ఈ రోజున కొత్త కారు కొనడం కూడా నిషిద్ధం. ఈ రోజున కొత్త కారు కొనడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని పండితులు చెబుతుంటారు. అందుకే గృహనిర్మాణంలో ఇనుమును ఎక్కవుగా ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే ఆదివారం ఇల్లు ప్రారంభించకూడదని పండితులు చెబుతున్నారు.
ALSO READ : కుంభరాశిలోకి కుజుడు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..
పశ్చిమ దిశలో ప్రయాణించడం మానుకోండి : ఆదివారం నాడు పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. ఈ రోజున పశ్చిమ దిశలో ప్రయాణించడం అశుభమని భావిస్తారు. మీరు ఈ దిశలో ప్రయాణించాల్సి వస్తే, బయలుదేరే ముందు నెయ్యి తినండి. లేకపోతే మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయని చెబుతున్నారు.
రావి చెట్టును పూజించవద్దు: ఆదివారం నాడు రావి చెట్టును పూజించవద్దు. హిందూ విశ్వాసాల ప్రకారం.. ఆదివారం నాడు రావి చెట్టును పూజించే ఎవరైనా వారి జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారు.
తులసి మొక్కకు అంటుకోవద్దు..నీళ్లు పోయవద్దు: పురాణాల ప్రకారం ఆదివారం తులసి మాత ఉపవాస దీక్షను పాటిస్తుంది. అందువలన ఆరోజు తులసి మొక్కను పూజించాలి. కాని ఎట్టి పరిస్థితిల్లో అంటుకోకూడదు. ఉపవాస దీక్షను పాటించడం వలన ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు.
ALSO READ : Good Health: ఇవి తింటే డిప్రెషన్ మాయం..
జుట్టు కత్తిరించవద్దు : చాలామంది ఆదివారం సెలవు రోజని.. కటింగ్.. షేవింగ్ చేసుకుంటారు. కాని పురాణాల ప్రకారం అలా చేస్తే ఆర్దిక ఇబ్బందులు పడతారని చెబుతారు. అందుకే పురాణాలు ఆదివారాల్లో జుట్టు కత్తిరించడాన్ని నిషేధించాయి. కాబట్టి ఆ రోజున జుట్టు కత్తిరించుకోకండి. ఆ రోజున జుట్టు కత్తిరించడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలహీనపడతాడని నమ్ముతారు.
నలుపు, నీలం రంగు దుస్తులు ధరించవద్దు : ఆదివారం నాడు నలుపు, నీలం రంగు దుస్తులు ధరించవద్దు. ఈ రోజున ఈ రంగులను ధరించడం నిషిద్ధం. సూర్య భగవానుడి అనుగ్రహం పొందడానికి, ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించండి.
ALSO READ : యాలకుల వెనుక ఉన్న అసలు రహస్యం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
