యాలకుల వెనుక ఉన్న అసలు రహస్యం: ఈ 5 చిట్కాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది..

యాలకుల వెనుక ఉన్న అసలు రహస్యం: ఈ  5 చిట్కాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది..

మన వంటింట్లో ఉండే యాలకులు కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, వాటికి గొప్ప ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది. యాలకులకు ప్రకృతిలోని శక్తులను ఆకర్షించే అద్భుతమైన గుణం ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవి శుక్ర, బుధ గ్రహాలకు సంబంధించినవి. ఇవి మనసులోని ఆందోళనలను తొలగించి, ఆలోచనల్లో స్పష్టతను ఇస్తాయి. అంతేకాకుండా, ఇవి మనకు రక్షణ కవచంలా ఉంటూ అదృష్టాన్ని మన వైపు తిప్పుకునేలా చేస్తాయి. ఇవి ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, అదృష్టాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. అయితే  యాలకుల చిట్కాలు ఏంటో చూద్దామా...

1. అదృష్టం కోసం 
యాలకులు మనల్ని దురదృష్టం నుండి కాపాడతాయి. ఒక 3 నుండి 7 పచ్చ యాలకులను ఒక పచ్చని గుడ్డలో కట్టి మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోండి. దీని వల్ల  మిమ్మల్ని చెడు దృష్టి నుండి కాపాడుతుంది అలాగే  కొత్త అవకాశాలను తెస్తుంది. ప్రతి శుక్రవారం వీటిని మారుస్తూ ఉండాలి.

ALSO READ : మీ పిల్లలు సైలెంటుగా ఉంటున్నారా ?

2. చదువు, జ్ఞాపకశక్తి పెరగడానికి
పిల్లల చదువులో ఏకాగ్రత పెరగడానికి యాలకులు బాగా పనిచేస్తుంది. గురువారం రోజున 21 యాలకులతో మాల చేసి హయగ్రీవ స్వామికి   సమర్పించండి. పరీక్షలకు లేదా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు ఒక యాలకుని నమలడం వల్ల బుధ గ్రహ దోషాలు పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

3. భార్యాభర్తల మధ్య ప్రేమ కోసం
భార్యాభర్తల  బంధాలలో గొడవలు తగ్గి, అన్యోన్యత పెరగడానికి శుక్రవారం రోజున 5 యాలకులను పొడి చేసి, పాలలో కొంచెం చక్కెర వేసి మరిగించండి. ఆ పాలను దంపతులిద్దరూ తాగాలి.  ఇలా చేస్తే  మనసులోని కల్మషాలను తొలగించి, ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది.

ALSO READ : ఈ 3 తప్పులు చేస్తుంటే.. మీరు బరువు తగ్గరు.. అవి ఏంటో తెలుసుకోండి..!

4. సంపద, ఐశ్వర్యం కోసం
డబ్బు ఇబ్బందులు తొలగి, ఆర్థికంగా ఎదగడానికి  ఒక చిన్న మట్టి కుండలో 11 యాలకులు, కొన్ని బియ్యం గింజలు, ఒక రూపాయి నాణెం వేయండి. దీన్ని తులసి మొక్క దగ్గర పాతిపెట్టండి లేదా మీ ఇంట్లో ఉత్తరం వైపు అంటే డబ్బులు పెట్టే చోట ఉంచండి. ఇలా  చేస్తే మీ  ఆదాయం పెరగడానికి సహాయపడుతుంది.

5. ఒత్తిడి తగ్గి, ప్రశాంతత కలగడానికి
ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉన్నా లేదా మానసిక ఆందోళనగా ఉన్నా  సాయంత్రం పూజ చేసే సమయంలో.. బొగ్గుపై రెండు యాలకులు, కొంచెం నెయ్యి వేసి ధూపం వేయండి. ఆ సుగంధం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పోయి, మనసు తేలికపడుతుంది. ఇంకా మీ ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది.