Good Health : ఈ 3 తప్పులు చేస్తుంటే.. మీరు బరువు తగ్గరు.. అవి ఏంటో తెలుసుకోండి..!

Good Health : ఈ 3 తప్పులు చేస్తుంటే.. మీరు బరువు తగ్గరు.. అవి ఏంటో తెలుసుకోండి..!

మీరు సరైన మంచి ఆహారం తింటున్నా, రోజూ ఎక్సయిజ్  చేస్తున్నా బరువు తగ్గకపోతే.. మీరు ఏదో తప్పు చేస్తున్నారని అనుకోకండి. ఎందుకంటే ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్  ప్రకారం, బరువు తగ్గకపోవడానికి కేవలం క్యాలరీలు మాత్రమే కారణం కాదు... మనం నీరు, ఒత్తిడి, నిద్ర వంటి మూడు అంశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే అసలు కారణం....  ఇవి మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసా.. 

1. నీళ్లు తక్కువగా తాగడం
మీరు రోజుకి సరిపడా నీరు తాగకపోతే, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే కిడ్నీలు ఇబ్బంది పడతాయి. అప్పుడు ఆ పనిని లివర్   చేయాల్సి వస్తుంది. నిజానికి కాలేయం పని కొవ్వును కరిగించడం. కానీ వ్యర్థాలను శుభ్రం చేసే పనిలో పడి అది కొవ్వును కరిగించడం మానేస్తుంది. దింతో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. ఇందుకు ఆకలిగా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగి చూడండి, ఎందుకంటే చాలాసార్లు దాహాన్ని మనం ఆకలి అనుకుని పొరబడతాం.

2. ఒత్తిడి 
మనసు ప్రశాంతంగా లేకపోతే శరీరంలో 'కార్టిసాల్' అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పెరిగితే మనకు తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. మీరు డైట్ పాటిస్తున్నా, ఒత్తిడి వల్ల మీ మెటబాలిజం నెమ్మదించి బరువు తగ్గకుండా ఆపుతుంది. దింతో  పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. అందుకే ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజులో కొద్దిసేపు నడక, చిన్న చిన్న వ్యాయామాలు లేదా ప్రశాంతంగా గడపడం అలవాటు చేసుకోండి.

3. సరైన నిద్ర
బరువు తగ్గడానికి నిద్ర ఒక అద్భుతమైన మందు లాంటిది. మనం మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడే మన శరీరంలో కండరాల మరమ్మత్తు, కొవ్వు కరిగించే ప్రక్రియలు జరుగుతాయి. నిద్ర లేకపోతే ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువవుతాయి. దీనివల్ల తరువాత రోజు మీరు తెలియకుండానే ఎక్కువగా తినేస్తారు. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి.

బరువు తగ్గడం అంటే కేవలం చెమటోడ్చడం, కష్టపడటం మాత్రమే కాదు, మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి కావాల్సిన నీరు, నిద్ర, ప్రశాంతత ఇవ్వడం. కొన్నిసార్లు కష్టపడి వ్యాయామం చేయడం కంటే, ఈ చిన్న విషయాలు గుర్తుంచుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.