ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్‌లో కోత

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్‌లో కోత

ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవల తన క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పులు ప్రకటించిన తర్వాత తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా అదే దారిలో ముందుకు సాగుతోంది. తన పాపులర్ క్రెడిట్ కార్డ్‌లైన మయూర (Mayura), అశ్వ (Ashva)తో పాటు లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డ్‌ల ప్రయోజనాల్లో భారీగా కోత విధిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త మార్పులు 2026, జనవరి 18 నుండి అమలులోకి రానున్నాయని బ్యాంక్ వెల్లడించింది. 

ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ప్రీమియం కార్డ్స్ అశ్వ, మయూర ఇంటర్నేషనల్ లావాదేవీలకు పెట్టింది పేరు. అయితే ఇకపై అంతర్జాతీయ ఖర్చులపై అందిస్తున్న 10X రివార్డ్ పాయింట్లను 5X కి తగ్గించింది బ్యాంక్. నెలకు రూ. 20వేల కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పుడు మాత్రమే పాత పద్ధతిలో 10X పాయింట్లు లభిస్తాయని స్పష్టం చేసింది. అలాగే గడువులోపు మినిమం బ్యాలెన్స్ డ్యూ చెల్లించకుంటే.. ఆ నెలకు సంబంధించిన రివార్డ్ పాయింట్లను బ్యాంక్ పూర్తిగా రద్దు చేస్తోంది.

లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డ్‌ల పరిస్థితి ఏంటి?
బ్యాంక్ అందిస్తున్న క్లాసిక్, సెలెక్ట్, వెల్త్ వంటి లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డుల రివార్డ్ కూడా 25 శాతం కోత విధించబడింది. గతంలో ప్రతి రూ.150 ఖర్చుకు లభించే రివార్డ్ పాయింట్‌ను.. ఇప్పుడు రూ.200 ఖర్చు చేస్తే వస్తాయి. అయితే పుట్టినరోజున చేసే ఖర్చులు, నెలకు రూ.20వేలు దాటిన లావాదేవీలపై 10X పాయింట్ల ప్రయోజనం కొనసాగుతుందని బ్యాంక్ వెల్లడించింది. 

ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ తగ్గింపు నిర్ణయం తరచుగా ప్రయాణాలు చేసే వారికి నిరాశ కలిగించనుంది. 
* సెలెక్ట్ క్రెడిట్ కార్డ్: ఒక క్వార్టర్లో 2 సార్లు అందించే డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ ఇప్పుడు 1కి తగ్గించారు.
* వెల్త్ క్రెడిట్ కార్డ్: ఒక క్వార్టర్లో అందిస్తున్న 2 డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్స్‌ను చెరో 1కి ఇప్పుడు తగ్గించారు. పైగా ఈ బెనిఫిట్ పొందాలంటే మునుపటి నెలలో కనీసం రూ.20వేలు కార్డుపై ఖర్చు చేసి ఉండాలి.

►ALSO READ | నాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి: ఢిల్లీ హైకోర్ట్

FASTag & రైల్వే చెల్లింపులపై కేవలం 1X రివార్డ్ మాత్రమే ఇకపై అందనున్నాయి. నెలకు రూ. 10వేలు దాటిన ఫాస్టాగ్ రీఛార్జిలపై, రూ.25వేలు దాటిన రైల్వే టికెట్ బుకింగ్స్‌పై 1 శాతం సర్ఛార్జ్ కూడా విధిస్తోంది బ్యాంక్. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా ట్రావెల్ బుకింగ్స్ చేసే వారికి హోటల్ బుకింగ్స్‌పై 33 శాతం, ఫ్లైట్ బుకింగ్స్‌పై 20 శాతం అదనపు బోనస్ రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తోంది. మొత్తంగా చూస్తే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్‌ల విలువను గణనీయంగా తగ్గించింది.