ధోనీ నా కెరీర్ నాశనం చేశాడా.. నోరు విప్పిన మాజీ స్టార్ క్రికెటర్

 ధోనీ నా కెరీర్ నాశనం చేశాడా.. నోరు విప్పిన మాజీ స్టార్ క్రికెటర్

ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో.. ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ క్రికెటర్ కెరీర్ ను.. ధోనీ నాశనం చేశాడు.. ధోనీ వల్లే అతని క్రికెట్ కెరీర్ అర్థాంతరంగా ముగిసింది.. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇంతకీ ఎవరా క్రికెటర్.. ఇప్పుడు అతను బయటకు వచ్చిన ఏం చెప్పాడు అనేది తెలుసుకుందామా..

ఆ మాజీ క్రికెటర్ పేరు అమిత్ మిశ్రా. ఇండియన్ మాజీ లెగ్ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్ లో 22 మ్యాచ్ లు ఆడాడు.. 76 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 36 మ్యాచ్ లు ఆడి 64 వికెట్లు తీశాడు. టీ 20 కెరీర్ లో 10 మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు తీశాడు. ధోనీ కెప్టెన్సీకి వచ్చిన కొత్తలో.. అమిత్ మిశ్రా అప్పటికే జట్టులో ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అతను జట్టు నుంచి తొలగించబడ్డాడు. అప్పటి విషయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో.. ఊహాగానాలతో కథనాలు వస్తున్నాయి. దీనిపై అమిత్ మిశ్రా ఇప్పుడు నోరు విప్పాడు.. అతని మాటల్లోనే ధోనీ గురించి ఏమంటున్నాడో చూద్దాం..

ధోనీ వల్లే నా క్రికెట్ జీవితం నాశనం అయ్యిందనే వార్తల్లో నిజం లేదు.. నేను ఎప్పుడూ.. ఎక్కడా ఈ మాటలు అనలేదు అంటున్నాడు. ధోనీ కెప్టెన్సీలో నేను ఆడాను.. నాకు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చాడు ధోనీ అని చెప్పుకొచ్చాడు. ధోనీ లేకపోతే నేను జట్టులో కూడా ఉండేవాడిని కాదు.. నేను ధోనీ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చాను.. మళ్లీ మళ్లీ వచ్చాను.. కెప్టెన్ గా ధోనీ నాకు చాలా అవకాశాలు ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు అమిత్ మిశ్రా.

నేను న్యూజిలాండ్ దేశంలో.. అక్కడ సిరీస్ ఆడుతున్నప్పుడు ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాడు అమిత్ మిశ్రా. నేను బౌలింగ్ చేస్తున్నాను.. అప్పుడు ధోనీ నా దగ్గరకు వచ్చి.. వికెట్ల కోసం కాదు.. పరుగులు కంట్రోల్ చేసే విధంగా బౌలింగ్ చేయాలి.. వాళ్ల టార్గెట్ పెద్దగా ఉన్నది.. పరుగులను కంట్రోల్ చేసినట్లయితే వికెట్లు ఆటోమేటిక్ గా వస్తాయి అంటూ ధోనీ చేసిన సూచన మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నాడు అమిత్ మిశ్రా. 

అదే మ్యాచ్ లో.. ఒత్తిడికి గురవుతున్న నన్ను ప్రోత్సహించింది.. దైర్యం చెప్పింది కూడా ధోనీనే అంటూ వివరించాడు అమిత్ మిశ్రా. ఎక్కువగా ఆలోచించొద్దని.. ఎప్పుడూ బౌలింగ్ వేసినట్లే బౌలింగ్ వేయాలని.. వికెట్ల కోసం ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పాడని.. ఆ మ్యాచ్ లో నేను 5 వికెట్లు తీశానని.. అది కూడా ధోనీ సూచనలతోనే సాధ్యం అయ్యిందని.. నా బౌలింగ్ కెరీర్ లో అదే బెస్ట్ అని వివరించాడు అమిత్ మిశ్రా.

ధోనీ కెప్టెన్ కాకుండా ఉండి ఉంటే.. అమిత్ మిశ్రా కెరీర్ మరోలా ఉండేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అమిత్ మిశ్రా స్పందన ఇదీ..