Vijay Jana Nayagan: దళపతి విజయ్‌కు మలేషియా షాక్!.. 'జన నాయగన్' ఆడియో ఫంక్షన్‌పై కఠిన ఆంక్షలు.

Vijay Jana Nayagan: దళపతి విజయ్‌కు మలేషియా షాక్!.. 'జన నాయగన్' ఆడియో ఫంక్షన్‌పై కఠిన ఆంక్షలు.

తమిళ చిత్రసీమలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న స్టార్ హీరో విజయ్.. త్వరలో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. ఆయన తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ను ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన నటించిన చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan)  .  ఈ మూవీ ఆడియో వేడుకను మలేషియాలో అత్యంత భారీగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. కానీ, ఈ వేడుకపై మలేషియా ప్రభుత్వం ఒక ఊహించని కండిషన్ పెట్టింది.

రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు..

మలేషియాలో జరిగే ఈ ఆడియో లాంచ్‌లో విజయ్ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధన విధించిందని సమాచారం.. సాధారణంగా విజయ్ తన సినిమా ఫంక్షన్లలో ఇచ్చే స్పీచ్‌లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ పరిస్థితులపై ఆయన చేసే విమర్శలు అభిమానుల్లో జోష్ నింపుతాయి. అయితే మలేషియాలో రాజకీయ ప్రసంగాలకు అనుమతి లేకపోవడంతో విజయ్ తన ప్రసంగాన్ని కేవలం సినిమాకే పరిమితం చేయాల్సి ఉంటుంది.

దళపతి తిరువిళా ...

డిసెంబర్ 27న జరగనున్న ఈ వేడుకను 'దళపతి తిరువిళా' పేరుతో ఒక భారీ కన్సర్ట్‌లా ప్లాన్ చేశారు. ఇది కేవలం ఆడియో లాంచ్ మాత్రమే కాదు... విజయ్ 30 ఏళ్ల సినీ ప్రయాణానికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తోంది.  ఈ వేడుకపై ఎస్పీబీ చరణ్, విజయ్ యేసుదాస్, టిప్పు, హరిచరణ్, ఆండ్రియా జెర్మియా, శ్వేతా మోహన్ వంటి దాదాపు 30 మంది ప్రముఖ  గాయని, గాయకులు విజయ్ కెరీర్‌లోని సూపర్ హిట్ పాటలను ఆలపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ వేడుక కోసం ఇంటర్నేషనల్ లెవల్ లైటింగ్ ,  భారీ స్టేజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

స్టార్ కాస్ట్ ..

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'జన నాయగన్' సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తున్నారు. ఇంకా ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమితా బైజు వంటి భారీ తారాగణం కీలక పాత్రలో  నటించారు.. ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈసినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ALSO READ : క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి ‘బాహుబ‌లి: ది ఎపిక్‌’.. 

 విజయ్ చివరి సినిమా కావడంతో ఆయన నోటి నుంచి వచ్చే రాజకీయ దిశానిర్దేశం కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ మలేషియా ప్రభుత్వ నిబంధనలతో వారు కొంత నిరాశకు గురవుతున్నారు. అయినప్పటికీ, దళపతి చివరి వేడుకను కళ్లారా చూసేందుకు నవంబర్ 28 నుంచే టికెట్ల బుకింగ్ కోసం అభిమానులు క్యూ కట్టారు...