‘బాహుబలి: ది ఎపిక్’ అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ రెండు భాగాలను కలిపి, కొత్తగా ఎడిట్ చేసి, 3 గంటల 45 నిమిషాల నిడివితో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా 'బాహుబలి - ది ఎపిక్' రీ-రిలీజ్‌లో తన సత్తా చాటింది. అంతేకాకుండా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ ఫిల్మ్‌గా చరిత్ర సృష్టించింది.
ఇపుడు ఈ‘బాహుబలి: ది ఎపిక్’ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా ఇవాళ (డిసెంబర్ 24న) 'బాహుబలి - ది ఎపిక్' ఓటీటీ అప్డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్. క్రిస్మస్ కానుకగా రేపు (డిసెంబర్ 25) నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా తెలిపింది.
ALSO READ : మాటల మాంత్రికుడి మాయాజాలం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ మైథలాజికల్ ఎపిక్!
బాహుబలి పార్ట్ 1 & 2 లను చూసిన వారికి సినిమా కథనం మొత్తం తెలుసు. అయితే, కథ తెలిసినవాళ్లకయినా.. తెలియనివాళ్లకైనా సరే ‘బాహుబలి : ది ఎపిక్’ ఓ కొత్త సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది. అందరినీ మరోసారి ఏకధాటిగా మాహిష్మతి ప్రపంచంలో లీనం చేసి, పాత్రలతో కలిసి ప్రయాణం చేయించారు డైరెక్టర్ జక్కన్న. అయితే, అలాగని ఇందులో కొత్తగా చేర్చిన సీన్స్, పాత్రలు ఏం ఉండవు.
రాజమౌళి తెరపై చూపించిన మాహిష్మతి రాజ్యాన్ని, లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్‌ని, యుద్ధాన్నీ, శక్తివంతమైన పాత్రల పరిచయాన్ని కొత్తగా చూపించారు. IMAX ఫార్మాట్‌కు పర్ఫెక్ట్‌గా ఆప్టిమైజ్ చేయబడింది. ఇమేజ్, సౌండ్ క్వాలిటీలో ఎక్కడా లోపం లేదకుండా డిజైన్ చేసిన తీరు శభాష్ అనిపించుకుంది. అయితే, సాధారణంగా ఇది డబ్బు కోసం చేసిన చౌక రీ-రిలీజ్ లా కాకుండా, ఓ అద్భుత ప్రపంచాన్ని మళ్లీ ఆడియన్స్ కోసం తీసుకొచ్చారు జక్కన్న.
ఇకపోతే, అర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇపుడు ఈ ఎపిక్.. ఓటీటీ ఆడియన్స్కు ఎలాంటి ట్రీట్ అందించనుందో తెలియాల్సి ఉంది.
