The Paradise: నాని సరసన సెన్సేషన్ బ్యూటీ.. ‘ది ప్యారడైస్’ హీరోయిన్ ఫిక్స్.. హడల్ పుట్టించే జడల్ లవర్ తనే!

The Paradise: నాని సరసన సెన్సేషన్ బ్యూటీ.. ‘ది ప్యారడైస్’ హీరోయిన్ ఫిక్స్.. హడల్ పుట్టించే జడల్ లవర్ తనే!

నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తోన్న ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే, ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి విడుదలైన గ్లింప్స్, నాని లుక్స్, నటి నటులు పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో నాని ‘జడల్’ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించనున్నారు. రగ్డ్‌‌ మీసం, గెడ్డం, రెండు జడలతో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని హడల్ పుట్టించేలా ‘జడల్‌‌’ లుక్స్ ఉన్నాయి. అలాగే, శికంజ మాలిక్ అనే కీలకపాత్రను మోహన్‌‌ బాబు, బిర్యానీ అనే ఇంటెన్సివ్ పాత్రలో సంపూర్ణేష్‌‌ బాబు, మరో కీలక పాత్రలో బాలీవుడ్‌‌ నటుడు ‘కిల్’ ఫేమ్ రాఘవ్ జుయల్‌‌ నటిస్తున్నారు.

ఈ సరికొత్త అప్డేట్స్.. ఆడియన్స్లో మంచి క్యూరియాసిటీని పెంచేశాయి. అయితే, అసలు సిసలైన జడల్ లవర్ ఎవరనేది మాత్రం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అనౌన్స్ చేయలేదు. రెండు జడలతో కిక్కించే పాత్ర పోషిస్తున్న నానికి ఎలాంటి అమ్మాయిని పట్టుకొస్తాడనే ప్రశ్న కామన్ సినీ ఆడియన్స్లో మొదలైంది. ఈ క్రమంలోనే నాని సరసన నటించే హీరోయిన్పై ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ALSO READ : దళపతి విజయ్‌కు మలేషియా షాక్!..

ప్రసెంట్ ఇంట్రెస్టింగ్ & ట్రెండింగ్ బ్యూటీ కయాదు లోహర్‌ ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్గా కయాదు తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేసి.. రూమర్స్కి మరింత బలమిచ్చింది. ‘ది ప్యారడైజ్‌’ గ్లింప్స్‌ను షేర్‌ చేస్తూ హార్ట్‌ ఎమోజీలను క్యాప్షన్గా జోడించింది. ఈ క్రమంలోనే నాని సరసన కయాదు లోహర్‌ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక మేకర్స్ నుంచి అధికారిక పోస్టర్ ప్రకటించడమే ఆలస్యం. 

కయాదు లోహర్ సినిమాలు:

‘డ్రాగన్’ సినిమాతో యూత్ ఆడియన్స్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కయాదు లోహర్. అంతకుముందు శ్రీ విష్ణు 'అల్లూరి'లోనూ మెరిసింది. కొత్త ఏడాదిలో విశ్వక్సేన్ 'ఫంకీ'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం కయాదు తెలుగు కూడా నేర్చుకుంటోంది. అయితే ‘ఫంకీ’, ‘ది ప్యారడైజ్’ తర్వాత నెక్స్ట్ టాలీవుడ్ లో ఈ బ్యూటీ ఫేట్ మారనుంది. మరోవైపు ఆడియన్స్లో ఆమెకున్న హాట్ ఇమేజ్కి తెలుగులో ఎలా లేదన్నా ఒక ఐదారు సినిమాలు వెంట వెంటనే పడేలా ఉన్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. 

సమ్మర్లో ‘ది ప్యారడైజ్’రిలీజ్:

'దసరా' సినిమాతో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి, నాని కెరీర్‌లో అత్యధిక గ్రాసర్‌గా నిలిచిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఈ సినిమాతో తన ఖ్యాతిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 'ది పారడైజ్' మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి నిర్మాణం, వినూత్నమైన కథాంశంతో  వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.