Nani The Paradise: 'ది ప్యారడైజ్' జడల్ ఆగమనం.. వందల మంది డ్యాన్సర్లతో నాని భారీ ఇంట్రో సాంగ్ షూట్!

Nani The Paradise: 'ది ప్యారడైజ్' జడల్ ఆగమనం.. వందల మంది డ్యాన్సర్లతో నాని భారీ ఇంట్రో సాంగ్ షూట్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise). ' దసరా ' వంటి సెన్సేషనల్ హింట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీపై సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

హైదరాబాద్‌లో భారీ సెట్..

ఃనాని గత చిత్రాల కంటే భిన్నంగా, ఈ సినిమాలో ఆయన మాస్ మేకోవర్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం నాని ఇంట్రడక్షన్ సాంగ్ 'ఆయా షేర్' చిత్రీకరణ జరుగుతోంది.  దాదాపు 600  మంది డ్యాన్సర్ల మధ్య, అత్యంత భారీగా వేసిన సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తనదైన మార్కు ఎలక్ట్రిక్ మాస్ ట్యూన్‌తో ఈ పాటను అదరగొట్టగా.. నాని సిగ్నేచర్ స్టెప్పులు, హై-వోల్టేజ్ యాక్షన్ మూమెంట్స్ ఈ పాటలో హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ పాటకు  విజయ్ 'జన నాయగన్' ఫేమ్ సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.  థియేటర్లలో ఈ సాంగ్ వస్తున్నప్పుడు ఫ్యాన్స్‌కి పూనకాలు గ్యారెంటీ అని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

కథా నేపథ్యం..

'ది ప్యారడైజ్' కేవలం యాక్షన్ చిత్రంగానే మాత్రమే కాదు. ఒక బలమైన సామాజిక ఇతివృత్తంతో సాగే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. సమాజంలో వివక్షకు గురైన ఒక తెగ కోసం పోరాడే 'జడల్' అనే వ్యక్తి ప్రయాణమే ఈ సినిమా. పౌరసత్వం కోసం, వ్యవస్థాగతమైన అన్యాయాలకు వ్యతిరేకంగా ఆ తెగ చేసే పోరాటానికి జడల్ ఎలా నాయకత్వం వహించాడు అనేది గుండెలకు హత్తుకునేలా చూపించబోతున్నారు శ్రీకాంత్ ఓదెల.

అగ్ర నటీనటుల కలయిక

ఈ సినిమాలో నానితో పాటు వైవిధ్యమైన స్టార్ కాస్టింగ్ ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలకమైన , పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.  బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతూ ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషిస్తున్నారు.  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒక సీరియస్ రోల్‌లో మెరవబోతుండటం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. సోనాలి కులకర్ణి కీలక పాత్రలో అలరించనుంది.

►ALSO READ | Spirit: వాట్సాప్ ఫ్యాక్టరీలో కథల అల్లడం మాని.. వెళ్లి మీ పని చూసుకోండి.. ప్రకాష్ రాజ్ ఫైర్

పాన్ ఇండియా రిలీజ్

ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ 'ది ప్యారడైజ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్, సి.హెచ్. సాయి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలు చేకూర్చనుంది.. ఈ విజువల్ వండర్ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 భాషల్లో మార్చి 26, 2026న విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. ఇది నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న చిత్రంగా 'ది ప్యారడైజ్' నిలువనుంది. అటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.