గంగారం హత్యల కేసులో.. 9 మందికి యావజ్జీవ శిక్ష

గంగారం హత్యల కేసులో.. 9 మందికి యావజ్జీవ శిక్ష

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు గంగారం హత్యలు. 2021లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో మూడు హత్యలు జరిగాయి. ఈ కేసులో.. 2025, డిసెంబర్ 23వ తేదీన జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ హత్య కేసులో సంబంధం ఉన్న 9 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడైంది. ఈ క్రమంలోనే జిల్లా కోర్టు దగ్గర ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. శిక్ష పడిన నిందితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. 

కేసు వివరాల్లోకి వెళితే.. కాటారం మండలం గంగారం గ్రామంలో భూ వివాదం ఏర్పడింది. ఈ క్రమంలోనే తండ్రి మంజునాయక్, అతని ఇద్దరు కొడుకులు సారయ్య, భాస్కర్ లను హత్య చేశారు నిందితులు. కంట్లో కారం కొట్టి.. గొడ్డళ్లల్లో నరికి చంపారు. ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు చెప్పారు పోలీసులు. 

►ALSO READ | 158 కోట్ల స్కామ్ కేసు..సన్ పరివార్ ఉపాధి గ్రూప్‌పై ఈడీ ఛార్జిషీట్

ఈ కేసులో నాలుగేళ్ల విచారణ తర్వాత.. జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. మూడు హత్యల్లో తొమ్మిది మంది ప్రమేయం ఉందని.. ఈ తొమ్మిది మందికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు జడ్జి. ఆ తర్వాత ఈ నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు తరలించారు పోలీసులు.