నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఘటనలో తండ్రి మృతి చెందగా.. కొడుక్కు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని మక్తల్ 167 జాతీయరహదారిపై జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మక్తల్ మండలం దండు గ్రామానికి చెందిన చిన్నారెడ్డి కొడుకు అబినందన్ తో కలిసి కారులో వెళ్తుండగా అటుగా వచ్చిన బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు.
ఈ ఘటనలో చిన్నారెడ్డి కొడుకు అబినందన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చిన్నారెడ్డి మృతదేహహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ అబినందన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనతో చిన్నారెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
