షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ప్రస్తుతం ఇన్సులిన్ కావాలంటే ఇంజక్షన్ తీసుకోక తప్పదు. అయితే ఈ నొప్పినుంచి రిలీఫ్.. ఇకపై ఇన్సులిన్ కోసం ఇంజక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంజక్షన్ కాకుండా నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ డ్రగ్ కంపెనీ సిప్లాకంపెనీ భారత్ లో అఫ్రెజా(ఇన్సులిన్ హ్యూమన్) ఇన్హేలేషన్ పౌడర్ ను విడుదలు చేసింది. ఇది వేగంగా పనిచేసే నోటి ద్వారా పీల్చే ఇన్సులిన్..ఇది సూది రహిత, ఇంజెక్షన్ ఇన్సులిన్ థెరపీ అవసరం లేకుండా ఇన్సులిన్ అందించే ప్రత్యామ్నాయం. ఇన్సులిన్ ఇన్ హేలర్ అందుబాటులోకి వస్తే భారత్ లో 10 కోట్ల మంది షుగర్ పేషెంట్లకు ప్రయోజనం లభిస్తుంది.
అఫ్రెజా ఇన్సులిన్ ఇన్హేలేషన్ పౌడర్ సింగిల్ యూజ్ కార్ట్రిడ్జ్‌లలో లభిస్తుంది. ఇన్హేలర్ పరికరం ద్వారా లభించనుంది. మాన్ కైండ్ అనే యూఎస్ సంస్థ ద్వారా తయారు చేయబడిన ఈ డ్రగ్..ఇండియాలో సిప్లా కంపెనీ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఇది నోటి ద్వారా పీల్చిన వెంటనే వేగంగా కరిగిపోయి, 12 నిమిషాల్లో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడం ప్రారంభిస్తుంది. రోజువాడే ప్రాండియల్ ఇంజెక్షన్లకు బదులుగా వేగవంతమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది టైప్ 1 ,టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ముఖ్యంగా వృద్దులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
►ALSO READ | Health tips: నిమ్మరసం పిండి తొక్క పడేయకండి..నిమ్మ తొక్కతో ఆరోగ్యప్రయోజనాలెన్నో!
షుగర్ పేషెంట్లకు ఇన్సులిన్ థెరపీ ఆలస్యంగా అందడం,ఆచరణాత్మక అడ్డంకులను తొలగించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ చికిత్సను బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది.
భారత్ లో ప్రతి షుగర్ పేషెంట్లకు చికిత్సను మరింత ఈజీగా చేయడం, ఇన్సులిన్ ఇంజక్షన్లతో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, అడ్డంకులను తొలగించేందుకు ఈ ఇన్సులిన్ ఇన్ హేలర్ ను తీసుకొస్తున్నట్లు సిప్లా గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అచిన్ గుప్తా చెబుతున్నారు. భారత్ లో మిలియన్ల కొద్ది షుగర్ పేషంట్లకు నమ్మకమైన , సౌకర్యవంతమైన చికిత్స అందించాలని కృషి చేస్తున్నామన్నారు.
