మాజీ స‌ర్పంచ్‌ ల పెండింగ్ బిల్లులు క్లియ‌ర్ చేయండి : జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్

మాజీ స‌ర్పంచ్‌ ల పెండింగ్ బిల్లులు క్లియ‌ర్ చేయండి : జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్
  •     ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యకు మాజీ సర్పంచుల జేఏసీ వినతి 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులతో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రజావాణి కమిషనర్, నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజ‌న్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

పంచాయతీ కార్యదర్శులే నేరుగా మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించేలా జీవో జారీ చేయాలని కోరారు. యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు సర్పంచులుగా పనిచేసిన వారు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. అప్పులకు వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయని, అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులతో పలువురు మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.