Health tips: నిమ్మరసం పిండి తొక్క పడేయకండి..నిమ్మ తొక్కతో ఆరోగ్యప్రయోజనాలెన్నో!

Health tips: నిమ్మరసం పిండి తొక్క పడేయకండి..నిమ్మ తొక్కతో ఆరోగ్యప్రయోజనాలెన్నో!

నిమ్మకాయం రసం పిండి పడేస్తున్నారా.. ఒక్క క్షణం ఆగండి..  నిమ్మ రసం లో  మాదిరిగానే నిమ్మ తొక్కలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి. మనం ఎక్కువగా నిమ్మరసం తాగడానికి ఇష్టపడతాం.. వంటల్లో కూడా వాడుతుంటారు. దీనిలో విటమిన సి  పుష్కలంగా ఉంటుంది.. పొటాషియం వంటి ఖనిజాలు బీపీని నియంత్రిస్తాయి.  అయితే నిమ్మ రసంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో నిమ్మ తొక్కలో కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు డాక్టర్లు. నిమ్మ తొక్కలతో ఆరోగ్య ప్రయోజనాలు, నిమ్మ తొక్కలను ఎలా తీసుకుంటే ఆ ప్రయోజనాలు అందుతాయో తెలుసుకుందాం.. 

నిమ్మలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే నిమ్మతొక్కలో ఉండే  పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. నిమ్మలో ఎన్ని ఆరోగ్య కరమైన ఔషధ గుణాలున్నాయో.. నిమ్మ తొక్కలో కూడా అంతే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిమ్మతొక్కలో ఉండే విటమిన్ A, కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిమ్మతొక్క బ్యాక్టీరియా వ్యాప్తిని అరికడుతుంది..అందుకే ఇండ్లలో ఎక్కువగా  పాత్రలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తుంటారు.  

నిమ్మతొక్కలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడేందుకు సాయపడతాయి. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. తాజా శ్వాసను అందిస్తాయి. నిమ్మతొక్కలోని సిట్రిక్ యాసిడ్ బ్యాక్టిరియాను సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. వేడినీటిలో  నిమ్మ తొక్కలు వేసి మరిగించి ఆ నీటిలో  బట్టను ముంచి శరీరంపై రుద్దితే దుర్వాసన పోతుంది. నిమ్మతొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకానికి చెక్ పెట్టొచ్చు. ఇది  ప్రేగుల్లో, జీర్ణాశయంలో ఉండే అల్సర్లను కూడా నాశనం చేస్తుంది.  

►ALSO READ | ఆధ్యాత్మికం: దేవుడికి పూలతో పూజ.. నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు.. దాని వెనుక శాస్త్రీయ రహస్యం ఇదే..!

ఇక బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బరువు ను బాగా తగ్గిస్తుంది. నిమ్మతొక్కలోని కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం  బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తాయి. నిమ్మతొక్కలో లభించే ఫ్లేవనాయిడ్స్  శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు  సాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.క్యాన్సర్ తోపాటు శరీరంలోని కణాలను దెబ్బతీసే వ్యాధులను రక్షణ గుణాన్ని కలిగి ఉంది డాక్టర్లు. 

ఎలా ఉపయోగించాలంటే..

  • ఎండబెట్టిన నిమ్మ తొక్కల పొడిని గ్రీన్ టీ, హెర్బల్ టీలో కలుపుకొని తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మ తొక్కల పొడిని కొంచెం వంట సోడా, ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, తెల్లగా మెరుస్తాయి.
  • నిమ్మ  తొక్కలు, తేనె , దాల్చిన చెక్కతో కలిపి వేడి నీళ్ళలో మరిగించి టీ వడగట్టి తాగడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. 
  • భోజనంలో  కొంత తొక్కను తురుము,  సలాడ్లు, సూప్‌లు రూపంలో తీసుకుంటే  మంచిది. 
  • నిమ్మ తొక్కలను నూనె, వెన్న వంటి పదార్థాలతో కలిపి ఊరగాయలు, సాస్‌లు, డిప్‌ల వంటి వివిధ రకాల వంటలను తయారు చేసుకోవడం ద్వారా తీసుకోవచ్చు. 
  • ఎండబెట్టి పొడి చేసిన నిమ్మ తొక్కను మాంసాహార వంటకాల్లో ఉపయోగించవచ్చు. డెజర్ట్‌లు, కాక్‌టెయిల్‌లలో బాగా వాడతారు. ఇంట్లో తయారుచేసిన మసాలా మిశ్రమాలలో కూడా ఒక పదార్ధంగా జోడించవచ్చు. వంటకంలో నిమ్మకాయ రుచిని జోడించాలనుకుంటే  సాధారణ మసాలా లాగా పొడిని జోడిస్తారు.