ముంబై రాజకీయం : 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన థాకరే బ్రదర్స్.. కొత్త చరిత్ర దిశగా మరాఠా పాలిటిక్స్

ముంబై  రాజకీయం : 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన థాకరే బ్రదర్స్.. కొత్త చరిత్ర దిశగా మరాఠా పాలిటిక్స్

దాదాపు 20 ఏళ్లుగా దూరంగా ఉన్న అన్నదమ్ములు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే మళ్ళీ చేతులు కలిపారు. 2026 ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

బుధవారం ముంబైలోని శివాజీ పార్క్ దగ్గర ఉన్న శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ థాకరే స్మారక చిహ్నం వద్ద ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ ఇద్దరు నాయకులు ఒకే కారులో రాజ్ థాకరే ఇంటి నుండి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దీని బట్టి చూస్తే రాబోయే BMC ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  సమాచారం ప్రకారం  శివసేన (UBT) మొత్తం 227 సీట్లలో 157 చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)  మిగిలిన 70 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనుంది.

ALSO READ : ఒక్కో హిందువు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలి:మాజీ హీరోయిన్, మాజీ ఎంపీ పిలుపు

 రాజకీయ వివాదాల వల్ల విడిపోయిన ఈ కుటుంబం మళ్ళీ కలవడం మరాఠీ ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏక్‌నాథ్ షిండే వర్గంతో పోరాడుతున్న ఉద్ధవ్ థాకరేకు తమ్ముడు రాజ్ థాకరే తోడు దొరకడం పెద్ద ప్లస్ పాయింట్. ముంబై మున్సిపల్ ఎన్నికలు ఉద్ధవ్ థాకరే రాజకీయ భవిష్యత్తుకు చాలా కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిస్తేనే శివసేన అసలు వారసుడు ఎవరనేది స్పష్టమవుతుంది.

మరాఠీ మనుషుల హక్కుల కోసం, ముంబై ఆత్మగౌరవం కోసం తామంతా ఒక్కటయ్యామని ఈ నేతలు చెబుతున్నారు. కులమతాలకు అతీతంగా ముంబై ప్రజలందరినీ కలుపుకుని వెళ్తామని శివసేన నాయకులు పేర్కొంటున్నారు.