విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా హై సినిమా టీజర్

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా  హై సినిమా టీజర్

దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గర అసోసియేట్‌‌‌‌‌‌‌‌గా, రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  వర్క్ చేసిన ఎస్ కృష్ణ ‘హై’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అలాగే నటుడిగా, రచయితగా చేస్తూనే  హరీష్ పెద్ది,  శేఖర్ దివ్వెలతో కలిసి  నిర్మిస్తున్నాడు.  అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  సోమవారం ఈ మూవీ  టీజర్‌‌‌‌‌‌‌‌ను  వెంకటేష్ లాంచ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘సాయి  నా సినిమాలకు పనిచేస్తూ గ్యాప్‌‌‌‌‌‌‌‌లో ఈ షూటింగ్ చేసేవాడు.  

తను మంచి టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌గా, ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌గా ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటున్నా.   మంచి జడ్జిమెంట్ ఉన్న టెక్నీషియన్. ఒక కొత్త జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిఫరెంట్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లేతో తీసిన సినిమా ఇది.  ఆడియెన్స్ చూసిన తర్వాత  తన ప్రయత్నాన్ని కచ్చితంగా ఆదరిస్తారు’ అని చెప్పాడు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు కార్యక్రమంలో పాల్గొని ఈ సినిమా టీమ్ అందరికీ హై ఇవ్వాలని కోరారు. దర్శక నిర్మాత ఎస్ కృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసే వాళ్ళకి మంచి హై ఇస్తుంది.  ఒక డిఫరెంట్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లేతో ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉండే మూవీ ఇది.  అన్ని లైవ్ లొకేషన్స్‌‌ లో షూట్ చేశాం’ అని చెప్పాడు.  టీమ్ అంతా పాల్గొన్నారు.