ఇంద్రజ కీలక పాత్రలో విప్లవ కారుడు

ఇంద్రజ కీలక పాత్రలో  విప్లవ  కారుడు

నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్, సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న చిత్రం ‘విప్లవ కారుడు’.  సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  ముహూర్తం షాట్‌‌‌‌‌‌‌‌కు సీనియర్  రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

 ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ ‘సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర్య  పోరాటంలో ఎలా పాల్గొన్నారు అనే అంశాన్ని ఇందులో చూపించబోతున్నాం.  ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా మారి స్వతంత్ర ఉద్యమంలో విరోచితంగా పోరాడే కథ ఇది.  ఇందులో  నేను రాణి భవానిదేవి పాత్రలో కనిపించబోతున్నా’ అని చెప్పారు.  బ్రిటిష్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో  హిస్టారికల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు నాగరాజ్ అన్నాడు. టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇదని  నిర్మాత ఏవీ జయరాం అన్నారు.