సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ట్రైనింగ్..మార్చి 31 వరకు పూర్తి చేసేలా కసరత్తు

సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ట్రైనింగ్..మార్చి 31 వరకు పూర్తి చేసేలా కసరత్తు
  • టీజీఐఆర్డిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ షురూ
  • ఈ నెల 13 వరకు కొనసాగమన్న ట్రైనింగ్

హైదరబాద్. వెలుగు: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీ రిన సర్పంచ్లు, వార్డుమెంబర్లకు పాలనపై పట్టు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారికి పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పిం చేందుకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నది... ఇందులో భాగంగా ట్రైనింగ్ ఇచ్చే అధికారులకు(ట్రై నర్స్) ముందుగా రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో క్లాసులు నిర్వహిస్తున్నారు.

సోమవారం నిర్వహిం చిన శిక్షణ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎంవీ శైలేష్ హాజరై అధికారు లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 12.769 మంది సర్పంచులు. సుమారు 1.11 లక్షల మంది వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఆఫీస ర్లు కార్యాచరణ రూపొందించారు. దీనికోసం ప్రతి జిల్లా నుంచి నలుగురు జిల్లా, మండల స్థాయి అధి కారులతో పాటు 25 మంది చొప్పున పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేశారు.

వీరికి రాజేంద్రనగ ర్లోని శిక్షణ కేంద్రంలో ఈ నెల 13 లోపు ట్రైనింగ్ పూర్తి చేయనున్నారు. శిక్షణ పొందిన అధికారులు జిల్లాలకు వెళ్లి మార్చి 31లోపు రాష్ట్రంలోని అన్నిగ్రా మపంచాయతీల పాలకవర్గాలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని డెడ్లైన్ విధించారు.

చట్టంపై అవగాహన కోసమే...

2018 పంచాయతీరాజ్ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని డిప్యూటీ కమిషనర్ శైలేష్ పేర్కొన్నారు. గ్రామాల్లో పాలన పారదర్శకంగా సాగాలన్నా, నిధుల వినియోగం సక్రమంగా ఉండాలన్నా చట్టంలోని నిబంధనలు తెలియా లన్నారు. చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వహిం చాలా సర్పంచులను, వార్డు సభ్యులను సన్నద్ధం చేసే బాధ్యత ట్రైనర్లదేనని పేర్కొన్నారు. కాగా, ఈ మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హను మకొండ, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి సహా మొత్తం 16 జిల్లాల నుంచి 315 మంది పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్టీవెన్ నీల్, జేడీ (ట్రైనింగ్) ప్రసూనా రాణి, యాదాద్రి భువన గిరి ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.