ఆ వీడియో చూసి నా తల్లి కంగారుపడ్డది:బిగ్ బాస్‌‌‌‌‌‌‌‌ ఫేమ్‌‌‌‌‌‌‌‌ అయేషా ఖాన్‌‌‌‌‌‌‌‌.

ఆ వీడియో చూసి నా తల్లి కంగారుపడ్డది:బిగ్ బాస్‌‌‌‌‌‌‌‌ ఫేమ్‌‌‌‌‌‌‌‌ అయేషా ఖాన్‌‌‌‌‌‌‌‌.

ఓమ్ భీమ్ బుష్‌‌‌‌‌‌‌‌, గ్యాంగ్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ గోదావరి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హిందీ ‘బిగ్ బాస్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్‌‌‌‌‌‌‌‌ అయేషా ఖాన్‌‌‌‌‌‌‌‌.. ఇటీవల ‘ధురందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంలోని షరారత్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌తో మరింతగా పాపులర్ అయింది.  ఏఐ దుర్వినియోగం, సెలబ్రిటీల వీడియోలను తీసే పాపరాజీల తీరుపై ఆమె చేసిన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ హాట్‌‌‌‌‌‌‌‌ టాపిక్‌‌‌‌‌‌‌‌గా మారాయి.  సోషల్ మీడియాలో మహిళలను అసభ్యకరంగా చూపించేలా ఏఐ యాప్స్ రావడం షాకింగ్‌‌‌‌‌‌‌‌గా ఉందన్నారు.  ‘ఇటీవల నేను ఓ పాపులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోతో క్లోజ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నట్టుగా క్రియేట్ చేసిన వీడియో చూసి నా తల్లి ఆందోళనగా ఫోన్ చేసింది. 

 అది ఏఐ ద్వారా సృష్టించిన తప్పుడు వీడియో అని ఆమెకు అర్థమయ్యేలా వివరించాల్సి వచ్చింది.  సాధారణ ప్రజలకు ఇవి నిజమో కాదో తెలియనంత సహజంగా వీడియోలు ఉంటున్నాయి’ అని ఆమె  వాపోయారు. అలాగే పాపరాజీల తీరుపై కూడా అయేషా ఫైర్ అయ్యింది.  కెమెరాలతో వెంబడించడం క్రేజ్ కాదు,  అదొక టార్చర్ అని... కారు దిగుతున్నప్పుడు, జిమ్ నుండి వస్తున్నప్పుడు చెప్పాపెట్టకుండా ఇబ్బందికరమైన యాంగిల్స్‌‌‌‌‌‌‌‌లో వీడియోస్‌‌‌‌‌‌‌‌ షూట్ చేసి వైరల్ చేయడం అసహ్యంగా ఉందని చెప్పింది. చాలామందికి సెలబ్రిటీల అనుమతి తీసుకోవాలనే విషయం కూడా తెలియడం లేదని ఆమె ఘాటుగా స్పందించింది.  అలాగే ప్రతి విషయాన్ని నెగిటివ్‌‌‌‌‌‌‌‌గా ట్రోల్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతోందని, డిజిటల్ నెగిటివిటీ మనుషులను వేధిస్తోందని అయేషా ఆవేదన వ్యక్తం చేసింది.