
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘అసెంబ్లీ ఎన్నికల టైంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన మూడు కోట్లు తరలించినట్లు మాజీ డీసీపీ రాధాకిషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు. ఇంతకీ వెంకట్రామిరెడ్డిని ఎందుకు, ఎవ్వరూ కాపాడుతున్నరు. డీజీపీ సమాధానం చెప్పాలి. మంత్రి పొంగులేటి వియ్యంకుడు అని అరెస్ట్ చేయడం లేదా? దీనికి ముఖ్యమంత్రి రేవంత్సమాధానం చెప్పాలి’ అని అన్నారు.