కెనాడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టోరంటో నగరంలో 32ఏళ్ల హిమాన్షీ ఖురానా అనే భారతీయ మహిళ హత్యకు గురైంది. టొరంటోశివారులో ఓ ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2025లో టోరంటోలో జరిగిన 40వ హత్యగా పోలీసులు తెలిపారు.
శుక్రవారం (డిసెంబర్ 19న) రాత్రి హిమాన్సీ నుంచి కనిపంచకుండా పోయిందని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం టోరంటో నగర శివారులో ఓ ఇంట్లో శవమై కనిపించిందని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే హత్యకు గురైన హిమాన్షీని ఆమె సన్నిహితుడు అబ్బుదల్ గఫూరి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం గఫూరీపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా గఫూరి ఫొటోను కూడా రిలీజ్ చేశారు.
