హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్ వర్క్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర MDMA, LSD botls, OG కుష్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువు రూ.4లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ముఠాలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూడా ఉండటం సంచలనంగా మారింది. నిందితులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.
