మెదక్ జిల్లాలో సర్కారు బడిలో వాటర్ ప్లాంట్..సొంత నిధులతో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థి

మెదక్ జిల్లాలో సర్కారు బడిలో వాటర్ ప్లాంట్..సొంత నిధులతో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థి

చిన్నశంకరంపేట, వెలుగు: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం జడ్పీహెచ్​ఎస్​లో పూర్వ విద్యార్థి సొంత ఖర్చులతో ఆర్వో మినరల్​ వాటర్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయించారు. పూర్వ విద్యార్థి అయిన హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​ మేనేజర్​ లక్ష్మీరామచందర్​ తన తల్లిదండ్రులు శామమ్మ నరహరి జ్ఞాపకార్థం ఈ వాటర్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయించి మంగళవారం ప్రారంభించారు. అనంతరం 152 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. 

గ్రామ అభివృద్ధి కోసం తనవంతుగా సహకరిస్తానని లక్ష్మీరామచందర్ అన్నారు. ప్లాంట్​ ఏర్పాటు చేసినందుకుగానూ ఉపాధ్యాయులు, స్టూడెంట్లు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలుక నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేశ్, హెచ్ఎం సాయిరెడ్డి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.